Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటింది. ఈ మూవీని సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వం వహించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. దీనిపై గతంలో కూడా సల్మాన్ ఖాన్ ఓ ప్రకటన చేశారు. అయితే తాజాగా ‘కిక్ 2’ మూవీకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ను అనౌన్స్ చేశాడు దర్శకుడు సాజిద్. దీంతో సల్మాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటోన్న ‘కిక్ 2’..


సల్మాన్ ఖాన్ ‘కిక్ 2’ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ దర్శకుడు సాజిద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కిక్ 2’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘కిక్ 2’ సినిమా కచ్చితంగా ఉంటుందని అన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని, అయితే దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పాడు. సల్మాన్ ఖాన్ కూడా స్క్రిప్ట్ ను చదివారని చెప్పాడు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.


సాజిద్ 2014లో ‘కిక్’ తో సాజిద్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అప్పట్లో ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్ల వసూళ్లను సాధించింది. అంతే కాకుండా ఈ మూవీతోనే నవాజుద్దీన్ సిద్దిఖీ, రణదీప్ హుడా వంటి నటులు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ విలన్‌ గా నటించగా, రణదీప్ పోలీస్ పాత్రలో నటించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా కనిపించింది. 


‘కిక్ 2’ కోసం సమయం కావాలి: సాజిద్


సల్మాన్ అవైటెడ్ సినిమాల్లో ఈ ‘కిక్ 2’ ఒకటి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీపై దర్శకుడు సాజిద్ ఆచుతూచి అడుగులు వేస్తున్నాడు. అన్నీ కుదిరినపుడే సినిమాను సెట్స్ పైకి తీసుకు వస్తామని ఇదే విషయం సల్మాన్ కు కూడా తెలుసన్నారు. ప్రస్తుతం సినిమా పేపర్ వర్క్ జరుగుతోందని  అన్నాడు. మూవీను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చూస్తున్నామని, అందుకు తగిన సమయం కూడా కావాలని  అప్పుడే ‘కిక్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నాడు. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మరి మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి. 


ఇక సల్మాన్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇటీవల ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో కనిపించారు. ఇందులో పూజా హెగ్డే, వెంకటేష్, జస్సీ గిల్, జగపతి బాబు, రాఘవ్ జుయల్, భూమికా చావ్లా, భాగ్యశ్రీ, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివార్, విజేందర్ సింగ్ తదితరులు నటించారు. రామ్ చరణ్, అబ్దు రోజిక్ ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. సల్మాన్ తదుపరి ‘టైగర్ 3’ లో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ స్పై పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: కన్నీళ్లు పెట్టించేశారు - విజయ్ దేవరకొండ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial