దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లో పలువురు స్టార్ హీరోలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో JioCinemaలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. షో మొదలై రెండు వారాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ షో నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు బిగ్ బాస్ స్టేజి మీదే ప్రకటించి సంచనలం కలిగించారు. తాజాగా జియో సినిమా షేర్ చేసిన ప్రోమోలో ఆయన కంటెస్టెంట్ల మీద తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ లో ఒక్కరి ప్రవర్తన కూడా బాగాలేదని మండిపడ్డారు. అందుకే తాను షోలో కొనసాగాలి అనుకోవడం లేదన్నారు.
‘నేను ఈ షో నుండి తప్పుకుంటున్నా- సల్మాన్ ఖాన్
జియో సినిమా రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ కోపం వెళ్లగక్కారు. “ మీరందరూ ఈ వారంలో చాలా హైలెట్ అనుకుంటున్నారు. కానీ, హౌస్ లో మీ ప్రవర్తన, కుటుంబ విలువలు, మన సంస్కృతికి అనుగుణంగా ఉందా? మీరు ఏం చేసినా నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను పట్టించుకోను. నేను ఇక్కడి నుంచి బయటపడుతున్నాను. నేను ఈ షో నుంచి నిష్క్రమిస్తున్నాను" అని సల్మాన్ ప్రకటించారు. ఈ ప్రోమోలో తీవ్ర ఆగ్రహానికి గురైన సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్స్ పట్ల తన నిరాశను వ్యక్తం చేశారు. ఇకపై బిగ్ బాస్ OTT 2 హోస్ట్ గా కొనసాగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రోమో బిగ్ బాస్ షో అభిమానులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిజంగానే ఆయన షో నుంచి వెళ్లిపోతున్నారా? అనే చర్చలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, ఇదంతా కేవలం రేటింగ్ పెంచుకునే ట్రిక్ అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రోమో తాలూకు పూర్తి ఎపిసోడ్ చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. అయితే, ఇటీవల షోలో ఓ జంట ముద్దులతో రెచ్చిపోయారు. లైవ్‌లోనే లిప్ కిస్‌తో ఆశ్చర్యపరిచారు. అదే సల్లూ భాయ్‌కు కోపం తెప్పించి ఉంటుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ OTT 2 గురించి..
తాజాగా బిగ్ బాస్ OTT 2 నుంచి ఆకాంక్ష పూరి ఎలిమినేట్ అయ్యింది. మె కేవలం 2 వారాలు మాత్రమే షోలో కొనసాగింది. ఇప్పటికే ఈ షో నుంచి పునీత్ సూపర్ స్టార్, పాలక్ పురస్వాని, ఆలియా సిద్దిక్ ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ OTT సీజన్ 2, జూన్ 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. సిమా తపారియా, అంజలి అరోరా, అవేజ్ దర్బార్, జియా శంకర్, పూజా గోర్ సహా పలువురు ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు.
Read Also: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ కంటెస్టెంట్ ఔట్, ఇదే ఫస్ట్ టైమ్!