సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు. ఆమె నాట్యమాడితే నెమలే గుర్తుకొస్తుంది. కేవలం ఆమె డ్యాన్సు కోసమే సినిమాలు చూసే వారు, యూట్యూబ్ లో పదే పదే పాటలు చూసే వాళ్లు ఎంతో మంది. టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఒక  టీవీ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. అందులో తానింకా తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నానని, తానెంత సంపాదిస్తున్నా అలా ఉండడమే తనకు ఇష్టమని చెప్పింది. 


ఓటీపీ అమ్మకే...
తాను ఇప్పుడు ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఆ ఓటీపీ అమ్మకే వెళుతుందని, ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడుగుతానని వివరించింది సాయి పల్లవి. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో కూడా తెలియదని, అమ్మని అడిగే తెలుసుకుంటానని చెప్పింది. ఏదైనా ఖరీదైన వస్తువులు కొంటే తన తల్లి వెంటనే ‘ఎందుకింద ఖరీదులు పెట్టి షాపింగ్ చేస్తున్నావ్’ అని ప్రశ్నిస్తారని వివరించింది. తన తల్లిదండ్రులు చిన్నప్పట్నించి ఏది కావాలన్న అడిగితే కొని తెచ్చేవారని, నాకు అదే నచ్చిందని తెలిపింది. ఫైనాన్షియల్ విషయాలు తానేమీ పట్టించుకోనని, అంతా తల్లిదండ్రులే చూసుకుంటారని చెప్పింది. ఇప్పటికీ నేను వారినే ఏదైనా కొనమని అడిగితే వారు చాలా హ్యాపీగా ఫీలవుతారు. 


అమ్మ ఆ డబ్బులు వద్దంది...
శర్వానంద్ కలిసి సాయిపల్లవి నటించిన సినిమా ‘పడి పడి లేచే మనసు’. ఈ సినిమా ఫ్లాఫ్ అయ్యింది. దీంతో నాకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ వద్దని చెప్పేసింది. అదే విషయాన్ని నిర్మాతకు కూడా తెలియజేసింది. ఆయన మాత్రం రిక్వెస్ట్ చేసి మిగతా రెమ్యునరేషన్ అంతా ఇచ్చేశారు. సాయిపల్లవి డ్యాన్సు, నటనే, వ్యక్తిత్వం కూడా చాలా ఆకర్షణీయమైనదని ఈ ఇంటర్య్వూ ద్వారా తెలిసింది. సాయి పల్లవి తన ప్రతి సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని తెలిపింది. తెలుగు కన్నా మలయాళంలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమని చెప్పింది.  


సాయిపల్లవి నటించిన సినిమా ‘విరాట పర్వం’ విడుదల కాబోతోంది.ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో సినిమా ‘గార్గి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితమే విడుదలైంది. చక్కని చీరకట్టులో, ఏదో ఆలోచిస్తున్న సాయి పల్లవి ఫస్ట్ లుక్ ఆమె పుట్టిన రోజునే విడుదల చేశారు. 


Also read: చిరంజీవి సినిమాలో ఛాన్సు కొట్టేసిన హీరో నితిన్?


Also read: ప్రభాస్ సినిమా షూటింగ్‌లో దీపికా పదుకోన్‌కు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు