సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'గార్గి' (Gargi). గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవల సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలానే మేకింగ్ వీడియో కూడా వదిలారు. చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కట్ చేశారు. ఇప్పుడేమో సినిమా ట్రైలర్ ను వదిలారు. 


ఈ సినిమాలో సాయిపల్లవి.. గార్గి అనే టీచర్ గా కనిపించనుంది. దానికి తగ్గట్లే కాటన్ చీర కట్టుకొని మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించింది. తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది గార్గి. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఒక సమస్య వస్తుంది. హీరోయిన్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని నమ్మే హీరోయిన్ అతడి కోసం పోరాటం చేస్తుంటుంది. ఆమెకి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. పోలీసులు కూడా ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉందని చెబుతారు. ఇంతలో ఓ లాయర్ ఆమెకి సాయం చేయాలనుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. 


ట్రైలర్ లో సాయిపల్లవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే.. నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 


Also Read: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?


Also Read: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!