టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే 'గార్గి' అనే సినిమాలో నటిస్తున్నట్లు.. ఆ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను రిలీజ్ చేసింది సాయిపల్లవి. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


కాసేపటి క్రితం సాయిపల్లవి మరో సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కోలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్న శివ కార్తికేయన్.. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. శివ కార్తికేయన్ నటిస్తోన్న 21వ సినిమా ఇది. దీన్ని కమల్ హాసన్.. సోనీ పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ షోలో ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 


ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దేశభక్తి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి స్కోప్ ఉందని.. దానికోసం రష్మికను తీసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. 


Also Read: 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తే' - 'మేజర్' ట్రైలర్ వేరే లెవెల్


Also Read: 'సర్కారు వారి పాట' సెన్సార్ రివ్యూ!