The Southern Rising Summit 2024 ABP Network : వాహనం నడిపేవారంతా తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించండి ఇది నా రిక్వెస్ట్ అని మరోసారి చెప్పారు సాయి దుర్గా తేజ్. ఏబీపీ దేశం సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా యాక్సిడెంట్ నాటి విషయాలు గుర్తుచేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు.. రోడ్డుపై పడిపోయాను అంతవరకే గుర్తుంది.  ఆ సమయంలో గొంతు రాలేదు, మాట్లాడలేకపోయాను. అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకున్నానంటే మా అమ్మ సపోర్టుతోనే సాధ్యమైంది. 2021 సెప్టెంబరు 11 న తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడంతో ఒక్కసారిగా  కింద పడిపోయారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఐకియా దగ్గర జరిగిన ఈ ఘటనలో  తేజ్ కంటి పై భాగానికి, ఛాతికి, కాలికి బలమైన గాయాలయ్యాయి.


మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడిన సాయి దుర్గా తేజ్...ఇల్లంతా హీరోలే కానీ..అందరం కలిసాం అంటే ఎప్పుడూ సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోం... మహా అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని మాత్రమే అడుగుతాం అంతే.. ఆ తర్వాత సొసైటీ గురించి మాట్లాడుకుంటాం అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు మేనమామ మాత్రమే కాదు గురువు, స్నేహితుడు అన్నీ. ఆయనతో కలసి బ్రో మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా అనిపించింది. నన్ను నటనవైపు నడిపించింది..నటనలో ప్రోత్సహించింది పవన్ కళ్యాణ్ అన్నారు.  


సాయి దుర్గా తేజ్ ఫస్ట్ మూవీ రేయ్ సెకెండ్ మూవీగా వచ్చింది..సెకెండ్ మూవీ సుప్రీమ్ ఫస్ట్ మూవీగా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టైంది. సాయి దుర్గా తేజ్ కి ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించిపెట్టింది. నటన, డాన్సులు, లుక్ పరంగా మంచి మార్కులుపడ్డాయ్. అయితే ఆ తర్వాత ఎంచుకున్న ప్రతి సినిమా కథ విభిన్నమైనదే అయినప్పటకీ 6 ఫ్లాపులు రావడంతో ఈ హీరో పనైపోయింది అనుకున్నారంతా.  కానీ ఆ ఆరు సినిమాల డిజాస్టర్ అయిన అనుభవం... ఎలాంటి కథలు ఎంపికచేసుకోవాలి? ఎలాంటి కథలకు నో చెప్పాలో నేర్పించాయన్నారు. 


మెగా హీరోలంతా ఓ దగ్గర చేరామంటే షాపింగ్, ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఈ సందర్భంగా రానా గురించి మాట్లాడిన సాయి దుర్గా తేజ్.. స్కూల్ డేస్ లో చరణ్ క్యారేజ్ కూడా తనే తినేసేవాడంటుూ సరదాగా చెప్పుకొచ్చారు..


ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం నటనపైనే ఉందన్న సాయి దుర్గా తేజ్... సినిమాల కన్నా ఓటీటీ ప్లాట్ ఫ్లామ్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. విభిన్న రకాల ప్రేక్షకులను అట్రాక్ట్ చేయాలంటే మంచి కథలపై ఫోకస్ చేయాలి. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగరాలు దాటి సినిమా గురించి ప్రస్తావించారు తేజ్. హారర్ మూవీస్ చూడడం అంటే భయం అన్న తేజ్..ఇప్పటివరకూ తాను నటించిన విరూపాక్ష మూవీ కూడా చూడలేదన్నారు. 


చిత్రలహరి మూవీ టైమ్ నుంచి క్యారెక్టర్లో ఒదిగిపోవడం ..అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నాలా ఉండడం ఎలాగో నేర్చుకున్నాను. సెట్ లో ఉన్నంతసేపూ ఆ క్యారెక్టర్లోనే ఉంటాను..అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను సాయి దుర్గా తేజ్ అంతే..


ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడిన తేజ్.. 300 మూవీ ఇన్పిరేషన్ తో అభిమానులు, సినీ ప్రియులు షాక్ అయ్యే కథలో రాబోతున్నాం .. ఇది తెలుగు సినిమానేనా అని అనుకునేలా మూవీ ప్లాన్ చేశాం. ఆ మూవీ వర్కింగ్ టైటిల్ SDT 18. ఇప్పటికే 30 % షూటింగ్ పూర్తైందన్నారు...


నిత్యం 2 గంటలు ఫిట్ నెస్ పై కాన్సన్ ట్రేట్ చేస్తానన్న సాయి తేజ్...డైలీ  ఈవెనింగ్ కిక్ బాక్సింగ్ క్లాస్, డాన్స్ క్లాస్ కి అటెండ్ అవుతున్నారు సాయితేజ్


ప్రస్తుతానికి ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందన్న తేజ్.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. పైగా రాజకీయాల్లోకి రావాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి..ప్రజా సమస్యలపై పూర్తి అవగహాన ఉండాలన్నారు..