Pushpa 2 Updates : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రూల్'. బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప'కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయాన్ని నిర్మాతలు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగా నెలకొన్న మెగా విభేదాలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
'పుష్ప 2' నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో మైత్రి మూవీ మేకర్స్ అధినేత, 'పుష్ప 2' నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా అల్లు అర్జున్ కష్టపడి పని చేశాడని, ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ మాస్టర్ పీస్ అవుతుందని, దీనికోసం 35 రోజుల పాటు షూటింగ్ జరిపామని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా 'పుష్ప 2' షూటింగ్ ఐటమ్ సాంగ్ తో సహా మొత్తం నవంబర్ 5 కల్లా పూర్తవుతుందని వెల్లడించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఇండియాలో మూవీని రిలీజ్ చేయబోతున్న అన్ని రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారు.
మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తర్వాత మేకర్స్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పెట్టారు. అందులో భాగంగా ఓ విలేఖరి 'పుష్ప' సినిమాపై మెగా విభేదాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ప్రశ్నించింది. "సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక రూమర్ కి సంబంధించినది ఇది.. అది నిజమా లేదా అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. 'పుష్ప' మూవీ రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఓకే తాటి కింద ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాల పరంగా రెండుగా విడిపోయారని టాక్ ఉంది. అయితే రిలీజ్ కు సంబంధించి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఫస్ట్ పార్ట్ లెవెల్ లోనే తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారా?" అనే ప్రశ్న ఎదురయింది నిర్మాతలకి.
ఈ విషయంపై నవీన్ ఎర్నేని మాట్లాడుతూ "మెగా అభిమానులంతా ఒకే మాట మీద ఉన్నారు. ఏమైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎలక్షన్ టైంలో వచ్చి ఉండొచ్చు గాని ఫ్యాన్స్ అందరూ ఒకే తాటి మీద ఉన్నారు. అలాగే అందరూ ఈ సినిమాను చూడడానికి ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ గా ఇదేమి డివైడ్ అవ్వలేదు. ఇది పొలిటికల్ గా డివైడ్ అయిందని మీరు లేనిపోని కామెంట్ చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు.. సినిమా లవర్స్ అందరూ ఒకటే. పొలిటికల్ గా ఆయనకి ఎవరితోనూ సంబంధం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి హాజరు కాకపోవడం గమనార్హం.
Also Ready : దీపావళి సమయంలో గట్ హెల్త్ని ఇలా కాపాడుకోండి.. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు రాకూడదంటే