సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జంటగా 'ది సోల్‌ ఆఫ్‌ సత్య' అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ గీతాన్ని, ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్  చేశారు. ఈ మ్యూజికల్ వీడియోకి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్‌ విజయకృష్ణ దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన వీడియోను టీ-సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. హీరోయిన్ రాశీ ఖన్నా పాడిన ఈ పాట,  ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఏకంగా మూడున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.


ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మ్యూజికల్ వీడియో దర్శకుడు నవీన్‌ విజయకృష్ణ సాయి ధరమ్ తేజ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి నవీన్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ మంచి మిత్రులు. సాయి ధరమ్ తేజ్, నవీన్ ను  ఇంటి దగ్గర దింపి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్ వార్త విని షాక్ కు గురైనట్లు నవీన్ తెలిపారు. “సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. ముందుగా చిన్న ప్రమాదం అయి ఉంటుందని భావించాను. అయితే, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సాయి ధరమ్ తేజ్ ను చూసి షాక్ అయ్యాను. ఆయన పరిస్థితి ఏంటనే దానిపై వస్తున్న వార్తలు మరింత గందరగోళానికి గురి చేశాయి. ఈ వార్తలు చూసి నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బైకులు అన్నింటినీ అమ్మేశాను. కొద్ది రోజుల పాటు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉన్నాను. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను” అని చెప్పుకొచ్చారు.  


యూట్యూబ్ లో దూసుకెళ్తున్న 'ది సోల్‌ ఆఫ్‌ సత్య'


ఇక యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'ది సోల్‌ ఆఫ్‌ సత్య' సాంగ్ ను హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలను మిక్స్ చేసి పాడిన విధానానికి సంగీత ప్రియులు ఫిదా అవుతున్నారు. ఫీల్ గుడ్ సాంగ్ కు అంతే ఫీల్ తో పాడిందనినెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోల్‌ ఆఫ్‌ సత్య రాశి ఫీట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యూట్యూబ్ లో దాదాపు 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రాశీ ఖన్నా హీరోయిన్ మాత్రమే కాదు గాయని కూడా అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె గతంలో 'జోరు', 'విలన్', 'బాలకృష్ణుడు', 'జవాన్', 'ఊరంతా అనుకుంటున్నారు', 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాలలో కొన్ని పాటలు పాడింది. 'సోల్ ఆఫ్ సత్య' వీడియోను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై 'బలగం' నిర్మాతలు హర్షిత్‌, హన్షిత నిర్మించారు. ఈ సాంగ్ కు శృతి రంజనీ ట్యూన్ కంపోజ్ చేయగా, రితేష్ రావు లిరిక్స్ రాశారు. సింగర్ తులసి కుమార్ ఆలపించారు.  



Read Also: వరలక్ష్మీ వ్రతంపై చిల్లర కామెంట్స్, చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ









Join Us on Telegram: https://t.me/abpdesamofficial