ఇనయా సుల్తానా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ నుంచి కెరీర్ మొదలు పెట్టి, ఇప్పుడిప్పుడే నటిగా మారుతోంది. ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ 'బిగ్ బాస్'తో బుల్లితెర ప్రేక్షకులలో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లో లేడి టైగర్ అనగానే తనే గుర్తుకు వస్తుంది. ఎవరు, ఎలాంటి మాటలు అన్నా, కించపరిచేలా ప్రవర్తించినా, ఎదుర్కొని నిలబడింది. చక్కటి ఆట తీరుతో బిగ్ బాస్ ఆడ పులిగా పేరు పొందింది.


ఇయనా సుల్తానా ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వత్రం


బిగ్ బాస్ షో తర్వాత ఇనయాకు మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఆఫర్లు రాలేదు. కానీ, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటై సందడి చేస్తోంది. తన వెకేషన్ కు సంబంధించి అన్ని విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది. మోడ్రన్ దుస్తులు గ్లామర్ మెరుపులు మెరిపించడంతో పాటు, సంప్రదాయ వస్త్రాల్లో ఆకట్టుకుంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసింది. అమ్మవారికి ధూపదీన నైవేద్యం సమర్పించి పూజలు చేసింది. ఈ పూజకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పింది.


చిల్లర కామెంట్స్ కు ఇనయా స్ట్రాంగ్ రిప్లై


ఇయనా వరలక్ష్మీ వత్రం చేయడంపై అసలు సమస్య మొదలయ్యింది. ఓ వర్గం నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. ముస్లీం అయి ఉండి వరలక్ష్మీ వ్రతం చేయడం ఏంటని ప్రశ్నించారు. మరికొంత మంది ఆమెపై బూతులతో విరుచుకుపడ్డారు. చెప్పలేని రీతిలో కామెంట్స్ చేశారు. తన గురించి చేస్తున్న అసభ్య వ్యాఖ్యలపై ఇనయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “నేను ముస్లీం అయితే మీకేంటి? హిందూ అయితే మీకేంటి? నేను ఇండియన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చెత్త ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించింది.






ఇనయాకు నెటిజన్ల సపోర్టు


ఇనయా సుల్తానా స్ట్రాంగ్ రిప్లై పట్ల చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్టు చేస్తున్నారు. కులం, మతం అని అడ్డగోలుగా ప్రవర్తించే వారికి మంచి సమాధానం చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికైనా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలంటున్నారు. దేశంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. మొత్తంగా ఇనయా సుల్తానా వరలక్ష్మీ వ్రతం కారణంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కొనసాగుతోంది.


Read Also: తెలుగులో సినిమాలు చేస్తున్నా, దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో తెలియదట - అడ్డంగా బుక్కైన కియారా అద్వాని









Join Us on Telegram: https://t.me/abpdesamofficial