ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. ఆ తర్వాత నెమ్మదిగా నెగెటివ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటిస్తున్న ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కన్నడ హీరోయిన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మమత మోహన్ దాస్, ఆశిష్ గాంధీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ‘రుద్రంగి’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో బండి చక్రంతో శత్రువులపై విరుచుకుపడుతూ జగపతి బాబు కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ చూడని రీతిలో జగపతి బాబు లుక్ కనిపిస్తున్నది. ‘రుద్రంగి నాది బాంచత్’ అంటూ అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఒళ్లు జలదరింపు కలిగించేలా ఉంది. దొరల కాలం నాటి పరిస్థితులను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ దొర(భీమ్ రావ్ దొర) పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి చాలా మంది హీరోలు మొదట తమ కెరీర్ ను విలన్ పాత్రలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోలుగా టర్న్ అయ్యారు. అలా వచ్చిన చాలా మంది ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. జగపతి బాబు విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తొలుత హీరోగా మంచి సినిమాలు చేశారు. ఫ్యామిలీ కమ్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి. యంగ్ హీరోలతో గట్టి పోటీ ఎదురయ్యింది. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలు చేయాలి అనుకున్నాడు. తొలిసారి ‘లెజెండ్’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అనిపించింది. గతంలో ఎప్పుడూ చూడని జగపతి బాబు ఈ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’ సినిమాల్లోనూ విలన్ గా నట విశ్వరూపం చూపించాడు. అటు తమిళంలోనూ పలు సనిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు నెగెటివ్ రోల్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తున్నది.
Also read: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!
Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్