రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను మొదటి రోజు చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు సినిమాని ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టారు.
అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇలా ప్రతి ఒక్కరూ రాజమౌళి వర్క్ కి ఫిదా అయిపోయారు. అయితే ప్రభాస్ 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. రాజమౌళితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి వల్లే తనకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిందని ప్రభాస్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్స్ కి రాజమౌళి సాయం తెలిసిందే.
అందుకే 'ఆర్ఆర్ఆర్' గురించి ప్రభాస్ ఏం మాట్లాడతారా ..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చూడలేదట. అందుకే ప్రభాస్ కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఈ సోమవారం నాడు ప్రభాస్ కోసం షో ప్లాన్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ కి ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వస్తారని సమాచారం. అయితే ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఎప్పుడు..? ఎక్కడ..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ