యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. 'కేజీఎఫ్2' రిలీజ్ తరువాత ఈ సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గాయి. హీరోల పెర్ఫార్మన్స్, జక్కన్న మేకింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అలానే కీరవాణి అందించిన సంగీతం సినిమాకి మరో ఎసెట్ గా నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు సినిమాలో ఒక్కో వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 'దోస్తీ', 'కొమ్మా ఉయ్యాల' పాటలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేయగా.. తాజాగా 'ఎత్తరా జెండా' పూర్తి వీడియో సాంగ్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.
'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అంటూ సాగే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలియా కూడా వారితో కలిసి డాన్స్ వేస్తూ కనిపిస్తుంది. ఎండ్ టైటిల్స్ లో ఈ సాంగ్ వస్తుంది.
నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?
Also Read: 'జబర్దస్త్'కు జడ్జ్ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?