యంగ్ టైగర్ జూనియర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు థియేటర్లలోనూ, సాయంత్రం యూట్యూబ్‌లోనూ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా, రన్‌టైంకు సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ నవంబర్ 26వ తేదీనే పూర్తి అయింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంటర్వెల్ విరామంతో కలుపుకుంటే సుమారు 3 గంటల 20 నిమిషాల వరకు ప్రేక్షకులు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది.
అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు, వీరు ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లకు పైగానే అవుతుంది కాబట్టి.. నిడివి సమస్య అయ్యే అవకాశం లేదు. దీంతోపాటు హీరో ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో గ్లింప్స్, మేకింగ్ వీడియోలు, రెండు టీజర్ల ద్వారానే తెలిసిపోయింది. కథనం ఎంగేజింగ్‌గా ఉంటే రన్‌టైం అసలు సమస్యే కాదని అర్జున్ రెడ్డి, రంగస్థలం, భరత్ అనే నేను లాంటి సినిమాలు ఇప్పటికే నిరూపించాయి.
రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ వంటి విదేశీ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి