దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ RRR. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా దేశ, విదేశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డుల కోసం పోటీ పడుతోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రెండు విభాగాల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. RRR ఈ అరుదైన ఘనత దక్కించుకోవడం పట్ల భారతీయ సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘RRR’ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ లో ‘RRR’ సత్తా
⦿ భారతీయ సినిమా పరిశ్రమ నుంచి గత రెండు దశాబ్దాలుగా ఏ సినిమా గోల్డెన్ గ్లోబ్ కు అవార్డులకు నామినేట్ కాలేదు.
⦿ RRR కంటే ముందు ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ అనే సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేట్ అయ్యింది.
⦿ మీరా నాయర్ దర్శకత్వం వహించిన ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ 2001లో విడుదల అయ్యింది.
⦿ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, లలిత్ దూబే, షఫాలీ షా, వసుంధర దాస్ కీలక పాత్రల్లో నటించారు.
⦿ ఈ చిత్రం పలు విభాగాల్లో గోల్డెన్ లయన్, ఇండిపెండెంట్ స్పిరిట్ ప్రొడ్యూసర్స్ అవార్డు, జీ సినీ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్, బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిలిమ్ అవార్డ్, బాలీవుడ్ మూవీ అవార్డులు అందుకుంది.
⦿ ‘RRR’ సినిమా ఐకానిక్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన మూడో భారతీయ సినిమాగా నిలిచింది.
⦿ ఇండియా నుంచి ఈ అవార్డుకు నామినేట్ అయిన తొలి సినిమా ‘దో ఆంఖే బారా హాత్’. వి.శాంతారాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1957లో విడుదల అయ్యింది.
⦿ ‘దో ఆంఖే బారా హాత్’ సినిమాలో వి.శాంతారాం, సంధ్య, బాబూరావ్ పెందర్కర్, ఉల్హాస్, బిఎం వ్యాస్ కీలక పాత్రల్లో నటించారు. దీన్ని హిందీ క్లాసిక్ సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.
⦿ ‘దో ఆంఖే బారా హాత్’ 8వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గెల్డెన్ బేర్ అవార్డును అందుకుంది. అటు శామ్యూల్ గోల్డ్ విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.
⦿ ‘RRR’ సినిమా ఈ ఐకానిక్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ చేయబడిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది.
⦿ టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది.
⦿ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ చేయబడిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నాటు నాటు’ ఖ్యాతి దక్కించుకుంది.
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు