వివాదాలను, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవితాన్ని వేరు చేసి చూడలేం! ఆయన ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరీ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని వర్మ ప్రయత్నిస్తూ ఉంటారు. పవన్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారని ఈ రోజు ట్వీట్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే...
 
దేవుడు కలలో చెప్పాడు!
''ఆ నాడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్... ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్రావు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ను మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్టే... ఈ సారి పవన్ కళ్యాణ్‌ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు'' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 


పేటీఎం దేవుడు చెప్పాడా?
వర్మ ట్వీట్ పట్ల నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'నువ్వు దేవుడిని నమ్మవు కదా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరొక నెటిజన్ అయితే 'పేటీఎం దేవుడు చెప్పాడా?' అని సెటైర్ వేశాడు. 'ఆ దేవుడిని మా కలలోకి కూడా రమ్మని చెప్పండి సార్' అని ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు. కొంత మంది అయితే బూతులు కూడా తిడుతున్నారు.









ఎన్నికలకు ముందు వర్మ హంగామా
ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసి ఓటీటీలో విడుదల చేశారు. వర్మను ఎన్నికల సమయంలో వైసీపీ ఓ పావుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజల్లో అభిప్రాయం నెలకొంది. దాని ఫలితమే పైన రిప్లైలు. 


రాజకీయ దుమారం రేపుతున్న వర్మ
తెలుగు దేశం, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ వర్మ ఈ మధ్య ఎక్కువ ట్వీట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రెండు పార్టీల అధినేతలు సమావేశమైన తర్వాత కులాలను సోషల్ మీడియాలోకి లాగుతూ ఆయన చేసిన ట్వీట్లపై పెద్ద చర్చ జరిగింది. 


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్ 


నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీపై ''డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మ వాళ్ళు" అంటూ వర్మ ట్వీట్ చేశారు వర్మ. రాజకీయంగా మాత్రమే కాకుండా కులాల పరంగానూ అది వివాదాస్పదమైంది. పవన్ సోదరుడు, నటుడు, జనసేన పార్టీ నాయకుడు వర్మ ట్వీట్ల మీద ఘాటుగా స్పందించారు. 


Also Read : దేవుడి గదిలో దిష్టిబొమ్మ - ఆ 16 మంది తలలు ఏమయ్యాయ్? 


అవసరం కోసం రామ్ గోపాల్ వర్మ ఎంతకు అయినా సరే దిగజారుతాడని, వాడు సన్నాసి వెధవ అంటూ నాగబాబు స్పందించారు. కులాన్ని పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్పని, దీన్ని బట్టి మనుషులను ఆయన ఎంత చులకనగా చూస్తున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. అప్పుడు నాగబాబు మీద వర్మ విరుచుకు పడ్డారు. 


తాను పవన్ అభిమానిగా ట్వీట్లు చేశారని, ఆ విషయం నాగబాబు అర్థం కాకపోతే తన కంటే అది పవన్ చేసుకున్న దురదృష్టమని వర్మ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ వెన్నుపోటు ట్వీట్ చేశారు.