ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగలో ‘శివ’ అనే సినిమా తీసి సంచలన విజయాన్ని అందుకున్నారు. తొలి హిట్ తోనే వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. అంతకు ముందున్న సినిమాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీలోనే ఈ సినిమాను ఓ మైల్ స్టోన్ గా నిలబెట్టారు. ఆ తర్వాత ‘క్ష‌ణ క్ష‌ణం’, ‘రంగీలా’, ‘స‌ర్కార్‌’, ‘స‌త్య‌’, ‘ర‌క్త చ‌రిత్ర’, ‘కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌’ లాంటి ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.


బర్త్ డే సందర్భంగా డెత్ డే సాంగ్ రిలీజ్!


సినిమాలను వదిలేసి సోషల్ మీడియా మీద పడ్డారు రామ్ గోపాల్ వర్మ. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. నా బర్త్‌ డే సందర్భంగా నా డెత్‌ డే పాట ఇదిగోండి అంటూ ట్విట్టర్ లో ఈ పాటను షేర్ చేశారు. తన అభిమానులు రూపొందించిన ఈ పాటను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ పాటపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పాట లిరిక్స్ మీ క్యారెక్ట‌ర్ బాగా సూట్ అయ్యాయి అంటున్నారు.  






నా బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పకండి - ఆర్జీవీ


ఏప్రిల్ 7న ఆర్జీవీ బర్త్ డే. అయితే, తన బర్త్ డే సందర్భంగా ఎవరూ శుభాకాంక్షలు చెప్పకూడదని ఆయన ఇప్పటికే ట్వీట్ చేశారు. విషెస్ అనేవి దేనికీ పనికి రానివన్నారు. “(7వ తేదీ) నా పుట్టిన రోజు. దయచేసి నాకు శుభాకాంక్షలు చెప్పకండి. విషెస్ అనేవి ఉచితం అయినవి, పనికి రానివి కూడా. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం” అంటూ ఆర్జీవీ ట్వీట్ లో రాసుకొచ్చారు.






నిత్యం వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ


ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, సామాజిక అంశాలు ఒకటేమిటీ, ప్రతి అంశంపై ఆయన మార్క్ స్పందన కనిపిస్తుంటుంది. విషయం ఏదైనా తన స్టైల్లో ట్వీట్లు చేసుంటారు. వాస్తవానికి ఆర్జీవీ మాట్లాడే ప్రతి మాట చాలా లాజిక్ గా ఉంటుంది. తనకు నచ్చినట్లుగా ఉండటం, తనకు నచ్చింది చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి తను చేసే పనులన్నీ అందరికీ నచ్చుతాయి. కానీ, బయటకు చెప్పలేరు. పైగా ఆయనపై విమర్శలు చేస్తుంటారు. పరిశీలించి చూస్తే, ఆయన చేసేది కరెక్ట్ అనిపిస్తుంది.


Read Also: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్, రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!