Vishal Vs Lyca Productions : తమిళ నటుడు విశాల్‌పై లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు  జూన్ 13న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ సౌంథర్‌ ఎదుట విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు తన నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి సినిమా ప్రాజెక్టులను నిర్మించలేదని విశాల్ తన న్యాయవాది ద్వారా పత్రాలను సమర్పించారు. అనంతరం విశాల్ న్యాయ ధిక్కారానికి పాల్పడలేదని పేర్కొంటూ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత విశాల్‌పై లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన క్రెడిట్ పిటిషన్‌లోని అభియోగాలను జూన్ 26, 2023న నమోదు చేస్తామని కోర్టు కేసును వాయిదా వేసింది.


దీంతో కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివాదంలో విశాల్‌కు స్వల్ప ఊరట లభించినట్టయింది. తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పు తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లోనే మద్రాసు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ ను కోర్టు గతంలోనే ఆదేశించింది. అంతే కాదు అప్పటివరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్, ఓటీటీల్లో విడుదల చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.


ఈ క్రమంలో కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించార‌ని, త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ. 15 కోట్లు చెల్లించ‌కుండానే ఆయ‌న న‌టించి, నిర్మించిన ప‌లు సినిమాల‌ని విడుద‌ల చేశార‌ని విశాల్‌పై లైకా కోర్టు ధిక్క‌ర‌ణ కేసుని ఫైల్ చేసింది. మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన జ‌డ్జి ఎస్‌.సెలాంద‌ర్..  విశాల్ న్యాయవాది సమర్పించిన ఆధారాలను పరిశీలించి కీలక తీర్పు ఇచ్చారు.


విశాల్ సంస్థ ఇంత వ‌ర‌కు ఎలాంటి సినిమాలు నిర్మించ‌లేద‌ని ఆయన తరపు న్యాయవాది త‌గిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ కోర్టుకు ఆధారాలు చూపించ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో విశాల్‌పై న‌మోదు చేసిన కేసుని కోర్టు కొట్టివేసింది. లైకా వేసిన ప్ర‌ధాన కేసుని మాత్రం జూన్ 26న విచారిస్తామని వాయిదా వేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇక హీరో విశాల్ సినిమా విషయాలకొస్తే ఆయన ప్ర‌స్తుతం 'మార్క్ ఆంటోనీ', 'తుప్ప‌రివాల‌న్ 2' చిత్రాల్లో న‌టిస్తున్నారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాధే శ్యామ్' తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తమిళ యాక్షన్ హీరో విశాల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రీసెంట్ గా విశాల్ కి రాధాకృష్ణ కుమార్ ఓ కథ చెప్పాడని, విశాల్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వచ్చాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ లో విశాల్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని మాత్రం టాక్ వినిపిస్తోంది.


Read Also : New theatres and OTT Releases: ‘ఆదిపురుష్’ TO ‘ది ఫ్లాష్’- ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే!