టాలీవుడ్‌లో దాదాపు కనుమరుగైపోయిన రెజీనా కసండ్ర.. నేనున్నానని చెబుతూ.. ‘నేనా నా?!’ అనే థ్రిల్లర్ చిత్రంతో వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ చూసి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్‌ను చూస్తే.. మొత్తానికి రెజీనా సక్సెస్ బాట పట్టడం ఖాయం అనిపిస్తోంది. ఇటీవల ప్రేక్షకులు కూడా సైతం రోత పుట్టించే హీరోయిజం సినిమాలను పక్కన పెట్టి.. థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఓటీటీల్లో కూడా ఈ చిత్రాలకు గిట్టుబాటు బాగానే ఉంది. ఇప్పటికే నయనతార విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటోంది. దీంతో రెజీనా కూడా ఆమె బాటలోనే ప్రయాణించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఎవరు’ సినిమా ద్వారా రెజినా మంచి హిట్ సాధించినా.. అవకాశాలు మాత్రం రాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నేనా నా?!’ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తోంది. 
 
మిస్టరీ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ‘నేనా నా?!’ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్‌ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో ఇప్పటికే కార్తిక్ మంచి దర్శకుడుగా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో రెజినా నటిస్తున్న ‘నేనా నా?!’ చిత్రంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలే ఉన్నాయి. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సూర్పనగై’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. యాపిల్ ట్రీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతం సమకూరుస్తు్న్నారు. 


Also Read: పోస్టర్లు అతికిస్తున్న సుధీర్ బాబు.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ కోసం పాట్లు


కొద్ది రోజుల కిందట హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అందులో రెజినా.. ముక్కు పుడకతో మహారాణిలా ఇనుప చువ్వల మధ్య బందీగా ఉన్నట్లు కనిపించింది. ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. అంటే రెజినా ఇందులో రెండు పాత్రల్లో కనిపించున్నట్లు అర్థమవుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రెజీనా ఓ అస్థిపంజరాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఉంది. చూస్తుంటే.. ఆ అస్థిపంజరం వెనుక మిస్టరీ ఏదో దాగుని ఉంటుందనిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్ట్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని, ఇందుకు రెజినా ప్రత్యేకంగా శిక్షణ పొందిందని నిర్మాతలు చెప్పారు. ఈ పోస్టర్‌ను రెజినా ట్విట్ చేసింది. ‘‘మళ్లీ ప్రయాణం మొదలుపెడుతున్నా.. ఇందుకు మీ ఆశీర్వాదాలు కావాలి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. 


రెజినా ట్వీట్: 


రెజినా స్టన్నింగ్ ఫొటోస్:





Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!