కోలీవుడ్ కి చెందిన రెజీనా కసాండ్రా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'అన్యాస్ ట్యుటోరియల్' అనే వెబ్ సిరీస్ లో ఆహాలో విడుదలైంది. ఈ హారర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

 

ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న 'షూర్ వీర్' అనే సిరీస్ లో నటిస్తోంది రెజీనా కసాండ్ర. కనిష్క్ వర్మ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇండియా మీద జరగబోయే ఎటాక్స్ ను అడ్డుకోవడానికి ఓ బృందం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేదే ఈ స్టోరీ. 

 

తాజాగా ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఓ టీజర్ ని వదిలారు. ఈ సిరీస్ లో రెజీనా అవంతిక రావు అనే ఫైటర్ పైలట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ లో ఆమె కూడా ఒకరని చెబుతూ.. ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఆమె గెటప్, డైలాగ్స్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జూలై 15 నుంచి హాట్ స్టార్ లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సిరీస్ తో రెజీనాకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!