రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సౌత్ కొరియా మూవీ మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాను తెలుగులో ‘శాకిని డాకిని’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది.   


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సీన్ షూటింగ్ వీడియోను రెజీనా తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో విలన్లను ఇద్దరు హీరోయిన్లు రెజీనా, నివేదా ఓరేంజ్‌లో చితక్కొడుతున్నట్లుగా ఉంది. వీరి యాక్షన్ సీన్ చూస్తే బ్రూస్లీని మించిపోయారు కదా అనిపిస్తుంది. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వీరిద్దరు ఫైట్ సీన్లు చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీరి ఫైట్లకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. చిన్న ఫైట్ లోనే వీరు అద్భుతంగా చేశారంటే.. సినిమా అంతా ఇంకెలా చేశారోనని ఆశ్చర్యపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే నివేదా సైతం ఈ సినిమా యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.





  





ఇక తాజాగా విడుదలైన శాకిని డాకిని ట్రైలర్ లో నివేదా, రెజీనా పోలీస్ అకాడమీలో శిక్షణ కోసం వస్తారు. ట్రైనీ ఐపీఎస్ అధికారులుగా  వీరి శిక్షణ తీసుకుంటారు. ట్రైలర్ మొదట్లో చాలా కామెడీగా కనిపిస్తారు. ఓ రోజు వీరిద్దరు బయటకు వెళ్తారు. అప్పుడు ఓ అమ్మాయిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. వాళ్లు ఆ అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని దాటుకుంటూ ఎంతో మంది అమ్మాయిలను కాపాడ్డం, విలన్లను పట్టుకోవడం సినిమాలో చూడాలి. ఇక ఈ ట్రైలర్  రెజీనా, నివేదా ఫైట్స్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం అర్థం అవుతుంది.



మొత్తానికి తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమా మంచి విజయాన్ని అందుకోబోతుందనే హోప్స్ కలిగిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ల కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లేడీ మల్టీ స్టారర్ సినిమా 16న విడుదల కాబోతుంది. జనాలు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే!