మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ శంకర్ 'ఇండియన్2' సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుంది. 


దీంతో అనుకున్నట్లుగా షెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ముందుగా 2023 వేసవికి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో శంకర్ ఆగస్టులో సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజుకి చెప్పారట. కానీ దిల్ రాజు మాత్రం 2023 దసరాకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు శంకర్. అంటే చరణ్ సినిమా ఇప్పట్లో రాదన్నమాట. 


చరణ్ భార్యగా అంజలి:
రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. రీసెంట్ గా మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
 
యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటివి కథగా తెలుస్తోంది. మరో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆమెకు, చరణ్‌కు మధ్య రొమాంటిక్ ట్రాక్ మెచ్యూర్డ్‌గా ఉంటుందట.


శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


RC16 కన్ఫర్మ్ అయినట్లేనా?
కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?