ధమాకా సినిమాతో రవితేజ మాస్ హిట్ కొట్టేశాడు. సినిమాకు రివ్యూయర్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వింటేజ్ రవితేజ మార్కు కనిపించిందని మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో మాస్ మహరాజ్ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ‘ఖిలాడీ’, ‘రామారవు ఆన్ డ్యూటీ’ డిజాస్టర్ల నుంచి తేరుకుని 2022ని బ్లాక్ బస్టర్‌తో ముగించాడు. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్లు మొదటి రోజు కంటే ఎక్కువ ఉందని ట్రేడ్ వర్గాల టాక్.
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా రూ.4.66 కోట్లను వసూలు చేసింది. క్రాక్ తర్వాత రవితేజకు ఈ స్థాయి ఓపెనింగ్స్ మళ్లీ ధమాకాతోనే వచ్చాయి. ఇక రెండో రోజు కూడా రూ.3.53 కోట్లను వసూళ్లు చేసి మంచి హోల్డ్ చేసింది. ఇక మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతరను మరిపించేలా మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.ఐదు కోట్ల వరకు వసూళ్లు మూడో రోజు వచ్చాయన్న మాట.
దీంతో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా మొదటి వీకెండ్‌లో రూ.13 కోట్ల వరకు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా హక్కులను రూ.16 కోట్లకు విక్రయించారు. వీటిలో రూ.13 కోట్లు మొదటి వీకెండ్‌లోనే వచ్చాయి. సంక్రాంతి వరకు ధమాకాకు పోటీగా సరైన సినిమా లేదు. కాబట్టి చాలా కాలం తర్వాత రవితేజ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించనుంది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.18.3 కోట్లుగా ఉంది. మొదటి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.10 కోట్లు వరకు వసూలు చేసింది. మూడో రోజు రూ.ఆరు కోట్లు వచ్చి ఉంటాయని అంచనా. అంటే మరో రూ.2.3 కోట్లు చేస్తే బ్రేక్ ఈవెన్ మార్కును ధమాకా దాటనుంది.
ఈ ఏడాది రవితేజ మూడు సినిమాలు విడుదల చేశారు. వచ్చే ఏడాది కూడా ఆయన నుంచి మూడు సినిమాలు రావడం కచ్చితంగా కనబడుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీనికి ‘ఈగిల్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' కూడా విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.