Ravi Teja and Harish Shankar movie Mr Bachchan kick starts with pooja ceremony: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈ రోజు పూజతో మొదలైంది. ఆయన కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'షాక్'... మరొకటి 'మిరపకాయ్'. సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.
రవితేజ సినిమా టైటిల్ 'మిస్టర్ బచ్చన్'
Mr Bachchan Telugu Movie: రవితేజ, హరీష్ శంకర్ కలయికలో మూడో సినిమా ఈ రోజు హైదరాబాద్ సిటీలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'మిస్టర్ బచ్చన్' టైటిల్ ఖరారు చేశారు.
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే రవితేజకు ఎంతో అభిమానం. ఇంతకు ముందు పలు సందర్భాల్లో ఆ విషయం చెప్పారు. 'కిక్'లోని ఓ సీనులో అమితాబ్ తరహాలో డ్రస్సింగ్ కావడమే కాదు... ఆయనను ఇమిటేట్ చేశారు రవితేజ. ఇప్పుడు తన కొత్త సినిమాకు అమితాబ్ ఇంటి పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశారు. 'మిస్టర్ బచ్చన్' అనేది సినిమా టైటిల్ అయితే... 'నామ్ తో సునా హోగా' అనేది క్యాప్షన్.
'మిస్టర్ బచ్చన్' టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్ గుర్తుకు వస్తుంది. ఆ వెనుక నటరాజ్ థియేటర్ కనబడుతోంది. మరి, ఈ సినిమాలో అమితాబ్ అభిమానిగా రవితేజ కనిపిస్తారా? లేదంటే సినిమా ప్రేమికుడిగానా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్ భాగ్య శ్రీ!
రవితేజ, హరీష్ శంకర్ కలయికలో సినిమాను పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పూజా కార్యక్రమాలకు ఒక్క రోజు ముందు రవితేజతో రొమాన్స్ చేయబోయే కథానాయికను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే నటించనున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇంతకు ముందు హిందీలో 'యారియాన్ 2' చేశారు. మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి అంటూ హరీష్ శంకర్ ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ రోజు జరిగిన పూజకు ఆమె కూడా హాజరు అయ్యారు.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
రవితేజ, హరీష్ శంకర్ సినిమా మేకర్స్ విడుదల చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్య శ్రీ బోర్సే చాలా గ్లామరస్ గా ఉన్నారు. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించారు. ఈ సినిమాలో మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారని త్వరలో వాళ్ళ వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, కెమెరా: అయాంకా బోస్!