త కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. మీ టూ ఉద్యమం పేరుతో పలువురు సీనియర్ నటీమణుల నుంచి వర్థమాన హీరోయిన్లు వరకు చాలా మంది ఈ అంశంపై నోరు విప్పారు. ఆయా సందర్భాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. అవకాశాల కోసం వెళ్లిన తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి రతన్ రాజ్ పుత్ సైతం తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం గురించి వివరించింది.. గతంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు వెల్లడించింది.


బలవంతంగా కూల్ డ్రింక్ తాగించారు!


“మీ టూ ఉద్యమం సమయంలో చాలా మంది తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాల గురించి మాట్లాడారు. కానీ, నేను అప్పుడు మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, ఇకపై మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను యువతరం నటీమణులు తెలుసుకోవాలి. సినిమా, టీవీ పరిశ్రమ మొత్తం చెడ్డది కాదు. కొంత మంది దుర్మార్గులు ఉన్నారు. వారి కారణంగానే ఇండస్ట్రీకి చెడు పేరు వస్తోంది. గతంలో నాకూ క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురయ్యింది. ఓసారి ఆడిషన్ ఉందంటే ముంబై ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడికి మీ టాలెంట్ నచ్చింది. ఆయనతో సమావేశానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. దర్శకుడిని కలిసేందుకు పై ఫ్లోర్ కు వెళ్లాను. అక్కడ వద్దు అని చెప్పినా కూల్ డ్రింక్ తాగమని ఇచ్చారు. వద్దు అంటున్నా బలవంతం చేసి తాగించారు. ఆ డ్రింక్ నాకు కాస్త తేడాగా అనిపించింది. ఆ తర్వాత మరో ఆడిషన్ ఉంటుంది. మళ్లీ కాల్ చేస్తాం అని చెప్పగానే వెళ్లిపోయా” అని చెప్పుకొచ్చింది. 


భయం వేసి బయటపడ్డాం


“ఫస్ట్ ఆడిషన్ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాం. కొన్ని గంటల అనంతరం మళ్లీ కాల్ చేశారు. మరో ఆడిషన్ ఉంది ఫలానా చోటుకు రమ్మని చెప్పారు. మేం అక్కడికి వెళ్లాం. ఆ రూం చాలా భయంకరంగా ఉంది. ఆ గది అంతా వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. అమ్మడే ఓ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. చూస్తుంటే మద్యం తాగినట్లుగా అనిపించింది. నా వెంట తీసుకెళ్లిన అబ్బాయిని చూసి బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడ్డారు. అతడు మా అన్నయ్య అని చెప్పాను. అక్కడి వాతావరణం ఎందుకో తేడాగా కనిపించడంతో అక్కడి నుంచి నెమ్మదిగా బయటపడ్డాం” అని రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో రతన్ రాజ్ పుత్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానితో పాటు  ‘మహా భారత్’, ‘సంతోషి మా’ సీరియల్స్ తో మరింత పాపులర్ అయ్యింది.   






Read Also: ‘OMG 2’లో స్వలింగ సంపర్కం సీన్స్‌ ఉన్నాయా? మూవీ టీమ్ సెన్సార్ బోర్డ్‌కు ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?









Join Us on Telegram: https://t.me/abpdesamofficial