కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 


'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రష్మిక. ఇప్పటివరకు ఏ సినిమాకి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేదు రష్మిక కానీ 'గుడ్ బై' విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఐదారు సినిమా అవకాశాలు వచ్చాయి.  తన క్రేజ్ ఇలానే ఉండాలంటే.. డెబ్యూ ఫిల్మ్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. అందుకే వీలైనంత ఎక్కువగా తన సినిమాను ప్రమోట్ చేస్తుంది. 


ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రమోషన్స్ కు రారు. కాబట్టి ప్రమోషన్స్ బాధ్యత మొత్తం రష్మికపై పడింది. ఎన్నడూ లేని విధంగా 'గుడ్ బై' ప్రమోషన్స్ లో స్కిన్ షో చేస్తుంది రష్మిక. ఎక్కువగా షార్ట్స్, మైక్రో స్కర్ట్స్ వేసుకుంటూ కనిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక 'మిషన్ మజ్ను', 'యానిమల్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


క్రేజీ సీక్వెల్ లో రష్మిక:
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.


 ఆగిపోయిన రష్మిక సినిమా:
ఇటీవల 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ అంతా చూసుకున్న ఆయన వర్కవుట్ కాదని భావిస్తున్నారు. ఈ సినిమాను రూ.140 కోట్ల రెమ్యునరేషన్ తో చిత్రీకరించాలనుకున్నారు. రీసెంట్ గానే 'లైగర్' సినిమాతో నిర్మాత కరణ్ జోహార్ కి భారీ నష్టాలొచ్చాయి. అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ప్లాప్ అయినా.. తక్కువ నష్టంతో బయటపడే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా అతడికి రిస్క్ అనిపించడంతో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.