'బాహుబలి' సినిమా తరువాత సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. దర్శకులు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. సౌత్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో శంకర్(Shankar) ఒకరు. ఇప్పటివరకు ఆయన ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్(Kamal Haasan)తో 'ఇండియన్2'(Indian2), రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


ఈ సినిమాల తరువాత శంకర్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళ ఇతిహాస నవల 'వేల్పరి'ని వెండితెర మీదకు తీసుకురానున్నారు శంకర్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. నిజానికి రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. 


కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారింది. 'వేల్పరి' నవలను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ తీయలేని విధంగా ఈ సినిమాను రూపొందించాలనుకుంటున్నారు. ఈ సినిమా ఒక విజువల్ వండర్ అవుతుందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. ఈ సినిమాతో యాక్షన్ సన్నివేశాల్లో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 


'వేల్పరి' కథ చాలా పెద్దది. మొత్తం కథని ఒకే సినిమాలో చూపించడం కష్టమవుతుంది. అందుకే దీన్ని మూడు భాగాలుగా చిత్రీకరించాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు.. మరి దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రస్తుతమైతే శంకర్ తను కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.  


RC15 కోసం శంకర్ భారీ ఈవెంట్:


చరణ్ సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. హైదరాబాద్ లేదా.. ముంబైలలో ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి పాన్ ఇండియా లెవెల్ లో కొందరు గెస్ట్ లను తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు అయితే కన్నడ స్టార్ యష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథులుగా కన్ఫర్మ్ అయ్యారు. ఈ లిస్ట్ లో మరింత మంది జాయిన్ కానున్నారు. ఎవరూ ఊహించని రేంజ్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు రాకుండానే ఈ పాన్ ఇండియా సినిమా బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. సినిమా ఓవర్సీస్ హక్కులను సుమారు రూ.15 కోట్లు పెట్టి దక్కించుకుంది ఓ సంస్థ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట్రికల్ హక్కుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 
 


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?