పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టైం అస్సలు బాగాలేదు. పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినా, అన్నీ డిజాస్టర్లుగానే మిగిలిపోతున్నాయి. తాజాగా  బాలీవుడ్ మూవీ ‘సర్కస్’తో హిట్ కొట్టాలని భావించినా ఫలితం దక్కలేదు. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 2022 పూజకు అస్సలు కలిసి రాలేదు.


వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూజా హెగ్డే


సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని బాలీవుడ్ లో అడుగు పెట్టింది పూజా హెగ్డే. గత రెండు సంవత్సరాలుగా టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోంది. కానీ, తను ఈ ఏడాది నటించిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర రాణించలేదు. చాలా సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక చతికిలపడింది.       


ఆ తర్వాత మెగా చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచింది. చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించినా ఆడియెన్స్ ను అలరించలేకపోయింది. అటు తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘బీస్ట్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ ఖాతాలోకి వెళ్లిపోయింది.


ఫ్లాప్ ఖాతాలోకి ‘సర్కస్’


ఇక బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ సినిమాపై ఈ ముద్దుగుమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకోని మళ్లీ ట్రాక్ లోకి రావాలి అనుకుంది. రోహిత్ శెట్టి, రణ్ వీర్ సింగ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ సినిమా తొలి షో తోనే భారీగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆడియెన్స్ ఈ సినిమా పట్ల పెదవి విరిచారు. సినిమా చూసిన వాళ్లంతా నెగటివ్ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమా కూడా ఫ్లాఫ్ గానే నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఓవైపు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగమ్మ, మరోవైపు సక్సెస్ లు లేక సతమతం అవుతోంది.





ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో  సల్మాన్ ఖాన్ తో సినిమాకు ఓకే చెప్పింది. తమిళ ఇండస్ట్రీలోనూ ఒకటి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Read Also: నటనలోనే కాదు, దర్శకత్వంలోనూ అదుర్స్ అనిపిస్తున్న సౌత్ స్టార్స్ వీళ్లే!