కొన్నాళ్లు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు -వీళ్లు వాళ్లవుతారని అంటారు. అది సినీ ఇండస్ట్రీకి కరెక్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. ఇండస్ట్రీలో కొందరు దర్శకులుగా వచ్చి నటులుగా సెటిలైపోతుంటారు. మరికొందరు నటులుగా వచ్చి దర్శకులు లేదా నిర్మాతలుగా మారిపోతుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో అలాంటివారు చాలామందే ఉన్నారు. మంచి సక్సెస్‌ను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు ‘కాంతారా’, ‘లవ్‌టుడే’ దర్శకులే నిదర్శనం. ఇలా దర్శకత్వం, నటనలో ప్రతిభ చూపిస్తున్న తారలు ఇంకా ఎవరెవరు ఉన్నారో చూసేద్దామా!
సినిమా సక్సెస్ కావాలంటే దర్శకుడు ఎంత ముఖ్యమో, హీరో కూడా అంతే ముఖ్యం. చక్కటి కథకు తగినట్లుగా నటిస్తేనే జనాల్లోకి వెళ్తోంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు అటు ఇటు చేసినా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోవాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది నటులు కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకులుగా మారిపోయారు. స్వీయ దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. దర్శకత్వం చేస్తూ నటించడం అంటే కాస్త ఇబ్బంది అయినా, సక్సెస్ ఫుల్ గా సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టారు. నాటి ఎన్టీఆర్ మొదలుకొని నేటి వెన్నెల కిశోర్ వరకు ఎంతో మంది నటులుగా, దర్శకులుగా రాణించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ప్రేక్షకులకు అందించారు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరో, వాళ్లు తెరకెక్కించిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎన్టీఆర్
ఎన్టీఆర్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తన అద్భుత నటనతో విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కించారు. చక్కటి విజయాలను అందుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన సినిమాల్లో కొన్ని.. ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతారామ కళ్యాణం, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘తాతమ్మ కల’, ‘గులేబకావళి కథ’, ‘చండ శాసనుడు’, ‘తల్లా? పెళ్లామా?’ సహా పలు సినిమాలను తెరకెక్కించారు. 1984లో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమద్విరాట్ పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
2. పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ప్రతిభ చాటుకునే ప్రయత్నం చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
3. ఘట్టమనేని కృష్ణ
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సైతం పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రిక్షావాలా’, ‘మానవుడు దానవుడు’ తదితర సినిమాలున్నాయి.
4. ఆర్.నారాయణమూర్తి
ఆర్.నారాయణమూర్తి తీసిన సినిమాలన్నింటిలోనూ ఆయనే హీరో, ఆయనే నటుడు, ఆయన అన్నీ. ‘ఎర్రసైన్యం’, ‘చీమలదండు’, ‘వేగు చుక్కలు’, ‘ఛలో అసెంబ్లీ’, ‘ఓరేయ్ రిక్షా’, ‘అడవి బిడ్డలు’ సహా పలు సినిమాలను తెరకెక్కించారు.
5. కమల్ హాసన్
కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో మీకు తెలిసిందే. ఆయన నటనలోనే కాదు. దర్శకుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. పోతురాజు, చాచీ 420(హిందీ), విశ్వరూపం, విశ్వరూపం-2, హేరామ్ (హిందీ) సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించారు.
నటన దర్శకత్వంలో రాణించిన మరికొందరు తారలు వీరే:
విజయ నిర్మల: దేవదాసు, కిలాడి కృష్ణుడుతోపాటు 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. 200 సినిమాల్లో నటించారు.
రవిబాబు: అనసూయ, అమరావతి, నువ్విలా, అవును 1, 2
అవసరాల శ్రీనివాస్: ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద
వెన్నెల కిశోర్: వెన్నెల 1 ½, జప్ఫా
ఎమ్మెస్ నారాయణ: కొడుకు
తనికెళ్ల భరణి: మిథునం
ఎస్వీ రంగారావు: బాంధవ్యాలు, చంద్ర గ్రహణం
భానుమతి: చంఢీరాణి
జీవిత రాజశేఖర్: శేషు, సత్యమేవ జయతే, మహంకాళి
ప్రకాష్ రాజ్: ఉలవచారు బిర్యాని
పోసాని కృష్ణ మురళి: మెంటల్ కృష్ణ, ఆపరేషన్ ధుర్యోధన
రాహుల్ రవీంద్ర: చి.ల.సౌ, మన్ముథుడు-2
రిషబ్ శెట్టి: కాంతార, కిరాక్ పార్టీ, మరో రెండు కన్నడ చిత్రాలు
ప్రదీప్ రంగనాథన్: లవ్ టుడే, కోమలి
Read Also: రష్యాలో ‘పుష్ప‘కు గట్టి ఎదురుదెబ్బ, మూవీ డిజాస్టర్ - రూ.3 కోట్లు నష్టం?