Viral Instagram Posts Of 2023: ఈ ఏడాది సినిమా పరిశ్రమ మంచి జోష్ లో కనిపించింది. పలు సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. కొన్ని భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను అలరించలేక చతికిలపడ్డాయి. కాసేపు సినిమాల విషయాలను పక్కన పెడితే... ఈ ఏడాది పలువురు సెలబ్రిటీల ఇన్ స్టా పోస్టులు బాగా వైరల్ అయ్యింది. వాటిలో టాప్ 10 వైరల్ పోస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం..
1.రణబీర్ కపూర్ వీడియో షూట్
‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుంచి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆమె భర్త, నటుడు రణబీర్ కపూర్ తన సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ వీడియో ఇన్ స్టార్ లో టాప్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది.
2.కృతి సనన్ 'పుష్ప' పోజు
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ను కలిసింది. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ తో కలిసి ‘తగ్గేదే లే’ అంటూ ఐకానిక్ ‘పుష్ప’ పోజు ఇచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.
3.ఆరాధ్య, అబ్రామ్ డ్యాన్స్
రీసెంట్ గా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం జరిగింది. ఈ వేడుకలో అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య, షారూఖ్ ఖాన్-గౌరీ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
4.దీపికా పదుకొణె ‘లుకింగ్ లైక్ ఏ వావ్’
2023లో అత్యంత వైరల్ ట్రెండింగ్ వీడియోలో ‘లుకింగ్ లైక్ ఏ వావ్’ ఒకటి. ఈ వాయిస్ తో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె చేసిన రీల్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 196 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది.
5.విక్కీ కౌశల్ డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ పాపులర్ 'obsessed' పాటకు వేసిన స్టెప్పులు ఇన్ స్టాలో టాప్ ట్రెండింగ్ లిస్టులో చేరాయి. వీ వీడియోకు లక్షల్లో వ్యూస్ దక్కాయి.
6.అనుష్క, విరాట్ డ్యాన్స్
బాలీవుడ్ బ్యూటీ అనుష్క తన భర్త విరాట్ తో కలిసి చేసిన డ్యాన్స్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ వీడియోలో అనుష్కతో కలిసి కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా, ఆయన కాలు పట్టేస్తుంది. వెంటనే ఆయన నొప్పితో పక్కకు వెళ్లిపోతాడు. జిమ్ లో చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.
7.లండన్ లో ఆదిత్య, అనన్య పాండే
బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే లండన్ వీధుల్లో షికార్లు కొట్టారు. ఈ ఫోటోల్లో ఇద్దరూ కలిసి రొమాంటిక్ పోజులో కనిపించి కనువిందు చేశారు. వీరి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
8.శ్రద్ధా కపూర్ కొత్త కారు
శిల్పా శెట్టి హోస్ట్ చేసిన దీపావళి బాష్ కు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హాజరయ్యింది. ఈ సందర్భంగా స్వయంగా లంబోర్ఘిని కారును నడుపుకుంటూ వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
9.హిమాలయాల్లో విద్యుత్ జమ్వాల్
ఇక బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హిమాయాల పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి. ఒంటి మీద నూలిపోగు లేకుండా గడపడం అందరినీ ఆశ్చర్యంలో ముచ్చెత్తింది.
10.హాలీవుడ్ స్టార్ తో బాలీవుడ్ స్టార్స్ పోజులు
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో NMACC లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో గ్లోబల్ స్టార్స్ టామ్ హాలండ్, జెండయాతో కలిసి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హోస్ట్ నీతా అంబానీ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ఇన్ స్టాలో టాప్ ట్రెండింగ్ లిస్టులో చేరాయి.
Read Also: హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, ‘హనుమాన్’ ట్రైలర్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్!