బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణబీర్ కపూర్ ల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 14)న రణబీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తు బిల్డింగ్ లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, కరణ్‌ జోహార్‌, ఆకాష్‌ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. 


పెళ్లి జరిగేవరకు ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫైనల్ గా వీరి పెళ్లి ఫొటో బయటకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రణబీర్-అలియాలకు శుభాకంక్షాలు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నిన్నటి నుంచే ఈ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముందుగా పితృ పూజ చేశారు. 


ఆ తరువాత మెహందీ ఫంక్షన్ ను నిర్వహించారు. ఇక పెళ్లిలో తన భార్యకు రణబీర్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. 8 వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. పెళ్లిలో అలియా ఈ బ్యాండ్ ను ధరించినట్లు తెలుస్తోంది. సబ్యసాచి రూపొందించిన పెళ్లి దుస్తులను ఈ జంట ధరించింది. మొత్తానికి ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైంది. 







ఇక వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. రణ్‌బీర్, ఆలియా వివాహం సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' తొలి భాగం నుంచి 'కేసరియా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. 


Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?


Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!