మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా (RC15) రూపొందుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు... బాలీవుడ్ బ్యూటీ, తెలుగులో 'భరత్ అనే నేను', వినయ విధేయ రామ' చిత్రాలు చేసిన కియారా అడ్వాణీ (Kiara Advani). మరొకరు... తెలుగమ్మాయి అంజలి (Anjali). ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది లీక్స్ వల్ల ఆడియన్స్‌కు తెలిసింది. 


చరణ్ భార్యగా అంజలి!
Anjali Plays Ram Charan Wife Role In RC15 : రామ్ చరణ్ చేత ఈ సినిమాలో శంకర్ డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయ్యింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
 
యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటివి కథగా తెలుస్తోంది. మరో హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆమెకు, చరణ్‌కు మధ్య రొమాంటిక్ ట్రాక్ మెచ్యూర్డ్‌గా ఉంటుందట.


శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజులు తాత్కాలికంగా షూటింగులు నిలిపివేయడం, శంకర్ 'భారతీయుడు 2' షూటింగ్ కోసం వెళ్లడం వల్ల అనుకున్న విధంగా సినిమా షూటింగ్ జరగడం లేదు. తొలుత ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక, రామకృష్ణ... ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ రవీంద్రర్ సినిమా నుంచి వాకౌట్ చేయడం కూడా షూటింగ్ ఆలస్యం కావడానికి ఓ కారణమని గుసగుస. 


Also Read : Chiranjeevi - Krishna Gardens : ప్రజారాజ్యం అప్పులకు చిరంజీవి అమ్మేసిన 'కృష్ణా గార్డెన్స్' చరిత్ర ఏమిటి? ఇప్పుడు దాని విలువ ఎంత?



పాన్ ఇండియా స్థాయిలో RC15 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నా... ప్రభాస్ 'ఆదిపురుష్', విజయ్ 'వారసుడు', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఉండటంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. మంచి సీజన్ చూసి విడుదల చేయాలనేది 'దిల్' రాజు ప్లాన్‌గా తెలుస్తోంది. 


'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రం (RRR Movie) తో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు. 


Also Read : Balakrishna As Reddy Garu : 'రెడ్డి గారు'కు ఓటు వేసిన బాలకృష్ణ?