'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ పలు సంచలనాలకు వేదికగా నిలిచింది. సినిమా సక్సెస్ కంటే ఇతర విషయాలు హైలైట్ అయ్యాయి. తనకు, తన చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కథనాలు రాసినట్టు చిరంజీవి (Chiranjeevi) వ్యాఖ్యానించారు. ఆయనపై వచ్చిన నెగిటివ్ కథనాలు పక్కన పెడితే... రాజకీయ వర్గాల్లో కూడా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ డిస్కషన్ పాయింట్ అయ్యింది.


'గాడ్ ఫాదర్' నిర్మాతలలో ఒకరు, ఇండస్ట్రీలో మెగా మనిషిగా ముద్ర పడిన ఎన్వీ ప్రసాద్ ''ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. నేను ఆ పార్టీలో భాగమైన వ్యక్తిని. ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఆయన అమ్ముడుపోయారని చాలా మంది అంటున్నారు. ఎవరికీ తెలియని నగ్నసత్యం ఏమిటంటే... మద్రాసులో ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉండే కృష్ణా గార్డెన్స్ ప్రాపర్టీని అమ్మి ప్రజా రాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజున అప్పులు అన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరంజీవి. ఇది ప్రపంచానికి తెలియదు'' అని చెప్పారు. అసలు, ఆ కృష్ణా గార్డెన్స్ చరిత్ర ఏమిటి? ఇప్పుడు దాని విలువ ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
 
కృష్ణా గార్డెన్స్ ఎవరిది?
ఆ పేరు ఎలా వచ్చింది?
కృష్ణా గార్డెన్స్ ప్రాపర్టీ సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేనిది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు షిఫ్ట్ కాకముందు సంగతి ఇది! మద్రాసులో తెలుగు సినిమాల షూటింగులు చేసేటప్పుడు... వడపళని ప్రాంతంలో వాహిని, ఏవీయం, ప్రసాద్ ల్యాబ్స్ (స్టూడియో) ఉండేవి. ప్రసాద్ ల్యాబ్స్‌కు కొంచెం దూరంలో అరుణ స్టూడియోస్ ఉండేది. ఆ ఆ స్టూడియో పక్కన ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉండేది. అదీ అరుణాచలం స్టూడియోస్ అధినేతలకు చెందిన స్థలమే. దానికి సూపర్ స్టార్ కృష్ణ కొన్నారు. 'కృష్ణా గార్డెన్స్' అని పేరు పెట్టారు. తన సినిమా షూటింగులకు ఆ స్థలాన్ని ఉపయోగించేవారు. 'కృష్ణా గార్డెన్స్'లో షూటింగ్ చేసిన మొట్టమొదటి సినిమా 'ఈనాడు'. ఆ చిత్రం కోసం మురికివాడల సెట్ వేశారు. ఆ తర్వాత కృష్ణతో పాటు పలు హీరోల సినిమా షూటింగులు జరిగాయి. 


'కృష్ణా గార్డెన్స్'లో ఎకరం కొన్న చిరంజీవి!తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత 'కృష్ణా గార్డెన్స్'లో షూటింగ్స్ తగ్గాయి. ఐదు ఎకరాల గార్డెన్స్ కాస్తా నాలుగు ఎకరాలు అయ్యింది. ఎందుకంటే... అందులో ఓ ఎకరాన్ని 1993లో ప్రాంతంలో చిరంజీవి కొనుగోలు చేశారు. దానినే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు అమ్మేశారు. 


Also Read : మెగాస్టార్ ఏనుగు - గరికపాటికి పద్మ కూడా ఎక్కువే - కౌంటర్లు వేసిన ఆర్జీవీ!


చిరంజీవి ఎంతకు అమ్మారు?
ఇప్పుడు అక్కడ ఎకరం విలువ ఎంత?
'కృష్ణా గార్డెన్స్'లో కొనుగోలు చేసిన ఎకరాన్ని చిరంజీవి 25 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం. నిజం చెప్పాలంటే... కృష్ణ అక్కడ స్టూడియో ఏర్పాటు చేసిన సమయంలో చెన్నై సిటీకి దూరంగా ఉండేది. నగరం విస్తరించుకుంటూ వెళ్లడంతో వడపళని ప్రాంతం ఇప్పుడు న్యూ చెన్నై సిటీగా మారింది. అక్కడ భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఎలా లేదన్నా... అక్కడ ఎకరం విలువ మూడు వందల కోట్ల రూపాయలు ఉండవచ్చని అనధికారిక సమాచారం. 



చిరు అమ్మేసిన ఎకరం పక్కన పెడితే... మిగతా నాలుగు ఎకరాలు పద్మాలయ స్టూడియోస్ అధీనంలో ఉన్నాయి. ఆ స్థలాన్ని డెవ‌ల‌ప్‌మెంట్‌కు ఇచ్చారు. ఆ స్థలంలో భారీ భవంతులు వెలిశాయి. అదీ సంగతి!  


Also Read : Sudheer Babu's Hunt Songs : నడుము సూత్తే పావుశేరే, బాడీలోన ఉందని ఫైరే - ఇది రొమాంటిక్ 'హంట్' సాంగ్ గురూ