పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ లుక్.. ఆ ఎనర్జీ చూసి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  భీమ్లానాయక్ మొదటి పాట  మీ అందరికోసం..


పాటలో సిహత్యంపై రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ఇది



వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ‘వకీల్ సాబ్’తో వచ్చి హిట్ కొట్టాడు. త్వరలో ‘భీమ్లా నాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ మాత్రం భీమ్లానాయక్ తర్వాతే రానుంది. కెరీర్‌లో తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మొఘలాయి రాజులను  ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.


హరిహర వీరమల్లులో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి  ఏ ఎం రత్నం నిర్మాత. ఇప్పటికే కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా కరోనా ప్రభావంతో వాయిదా పడింది.  ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.


సంక్రాంతికి ‘భీమ్లానాయక్’: ముందుగా హరిహర వీరమల్లు సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ షూటింగ్ లేట్ అవడంతో పాటూ...అదే సమయానికి  పవన్ కళ్యాణ్ మరో మూవీ ‘భీమ్లా నాయక్’ డేట్ ఫిక్స్ చేశారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేశాం కానీ ఇదే టైటిల్ ఫిక్స్ కాదంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత మరో పేరు ప్రకటిస్తామంటున్నారు. కానీ ఇప్పటికే మాస్‌లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ వెళ్లిపోయింది. నిర్మాతలు భీమ్లా నాయక్ కాకుండా మరో పేరు పెడతారన్నది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.


Also Read: Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!