'హనుమాన్' సినిమా టీమ్ విడుదలకు ముందు ఓ ప్రకటన చేసింది. ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలను అయోధ్యలో రామయ్య మందిరానికి విరాళంగా ఇస్తామని తెలియజేసింది. సేమ్ రూటులో 'రామ్' సినిమా టీమ్ వెళుతోంది. తమ సినిమాకు వచ్చే కలెక్షన్లలో ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తెలిపింది. మరి, వాళ్లు ఎవరికి ఇస్తున్నారో తెలుసా?
నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు 'రామ్' విరాళం
రామ్... అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్! దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దీంతో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా పరిచయం అవుతున్నారు. దేశంలో తీవ్రవాదం, హిందూ - ముస్లిం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దేశంలో అలజడి, కల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలు... వాళ్ళను ఎదుర్కొన్న హీరో సినిమా కథాంశం. అందుకని, నేషనల్ డిఫెన్స్ ఫండ్ (National Defence Fund)కు టికెట్ మీద ఐదు రూపాయలు విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు దేశమంతా 'హనుమాన్' ఆడుతోందని, 'రామ్' కూడా ఆ సినిమా తరహాలో విజయం సాధిస్తుందని ఇందులో కీలక పాత్ర చేసిన సాయి కుమార్ చెప్పారు.
'రామ్' సినిమాను దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓఎస్‌ఎం విజన్ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ నెం.1గా రూపొందించింది. హీరోతో పాటు దర్శకుడు మిహిరామ్ వైనతేయకు కూడా తొలి చిత్రమిది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయన రాశారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత.
సూర్య అయ్యల సోమయాజుల సరసన ధన్యా బాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ... ''మా మొదటి చిత్రమిది. మేం సినిమా నేపథ్యం నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన నిర్మాణ వ్యయంలో సినిమా తీశారు. హీరో సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాకు తెగే ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం. మన సైనికులకు ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం'' అని చెప్పారు.
Also Read: సీఎం యోగిని కలిసిన 'హనుమాన్' - ఏయే టాపిక్స్ డిస్కస్ చేశారంటే?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ... ''మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. ఎన్నో ఆర్థిక కష్టాలు పడి చిత్రాన్ని నిర్మించారు. నేను రషెస్ చూశా. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమాలో సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
Also Read: రామ్ చరణ్ బర్త్ డేకి ముందు - నయా మేకోవర్‌తో సెట్స్ మీదకు!
హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ... ''మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నేను, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్... సినిమాకు మెయిన్ పిల్లర్స్. ఫ్రెండ్స్ అంతా కలిసి ఫండింగ్ చేసి సినిమా తీశాం. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. వందలో 60 మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. భానుచందర్, సాయి కుమార్ గారు చెప్పే డైలాగ్స్థాం తూటాల్లా పేలతాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ ఇస్తుంది'' అని అన్నారు. ధన్యా బాలకృష్ణ, మిహిరామ్ వైనతేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: ఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'