మాస్ సినిమాలను రూపొందించడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల, సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ ను ఇప్పటి వరకూ చూడని మాసీగా చూపించబోతున్నారు బోయపాటి.
ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 24 రోజుల షూటింగ్
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో రామ్ మాసివ్ లుక్ ప్రేక్షకులను అట్ట్రాక్ చేసింది. అంతేకాదు, ఈ చిత్రంలోని లో ఫైట్స్ కూడా అంతే మాసివ్ గా ఉంటాయని తెలిసింది. సినిమాలోని హైలైట్స్ లో బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి అని తెలిసింది. సుమారు పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. ఇది కాకుండా 1500 మందితో మరో ఫైట్ తీశారట. ఈ ఫైట్ సీన్ కోసం ఏకంగా 24 రోజుల పాటు కష్టపడ్డారట. ఈ విషయాన్ని హీరో రామ్ స్వయంగా వెల్లడించారు. ఒక్క యాక్షన్ సీన్ కోసం 24 రోజులుల శ్రమించి కంప్లీట్ చేశామని తెలిపారు.ఈ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ యూజ్ చేశారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్స్ తీసినట్లు తెలుస్తోంది.
రామ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల
హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మే 15న ఫస్ట్ థండర్ పేరుతో సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టల్లో చూపించినట్లుగానే రామ్ లుక్ ఊరమాస్ గా ప్రేక్షకులను అలరించింది. ఫస్ట్ థండర్ ఓపెనింగ్ లో రామ్ పెద్ద కత్తితో నడుచుకుంటూ వస్తూ కనిపిస్తారు. బాంబు పేలుడు ధాటికి జీపులోని విలన్స్ అంతా కత్తులతో చెల్లాచెదురుగా పడతారు. ఆ తర్వాత దున్నపోతును పట్టుకుని సదర్ ఉత్సవంలోకి రామ్ ఎంట్రీ ఇస్తారు. “ నీ గేటు దాటలేను అన్నావ్, దాటా. నీ గేటు దాటలేను అన్నావ్, దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్, దాటా, ఇంకేటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రామ్ చెప్పే మాసీ డైలాగ్స్ అదిరిపోయాయి. విలన్స్ ను చితకబాదే విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి.
విజయ దశమి కానుకగా విడుదల
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 20నబోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Read Also: మన హీరోయిన్లు చాలా రిచ్ గురూ, అత్యధిక ఆస్తులు కలిగిన నటి ఈమే!