సోషల్ మీడియా వేదికగా నటి పూనమ్ కౌర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ తరుచుగా పెద్ద దుమారం కలిగిస్తాయి. పూనమ్ కొన్నిసార్లు పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా సెటైర్లు వేస్తుంది. మరికొన్ని సార్లు ఆయనకు మద్దతుగా ట్వీట్లు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక వర్మ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద పొద్దున లేస్తే సెటైర్ల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా పూనమ్ కౌర్, ఆర్జీవీ చేసిన ట్వీట్లు పవన్ అభిమానులకు పట్టరాని కోపం తెప్పిస్తున్నాయి.


‘బ్రో’ మూవీపై రాజకీయ దుమారం


పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి తాజాగా ‘బ్రో’ అనే సినిమా చేశారు. గత నెల(జులై) 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే తీవ్ర వివాదం చెలరేగింది. ఈ చిత్రంలో మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేస్తూ, శ్యాంబాబు పేరుతో కమెడియన్ పృథ్వి డ్యాన్స్ చేశారు. సంక్రాంతి భోగి వేడుక సందర్భంగా అంబటి వేసిన డ్యాన్స్‌ను మక్కీకి మక్కీ దింపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలయ్యింది. పవన్ కల్యాణ్ మీద, ఆ సినిమా మీద అంబటి నిప్పులు చెరిగారు. తన పాత్రను సినిమాలో పెట్టి పవన్ శునకానందం పొందుతున్నాడంటూ మండిపడ్డారు. ఇలాంటి వెకిలి వేశాలు వేస్తే పవన్ కల్యాణ్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని హెచ్చరించారు.  


వైరల్ అవుతున్న పూనమ్, ఆర్జీవీ ట్వీట్స్


ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న సినిమా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది.  “రాజకీయాలు ఎంటర్‌టైనింగ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ సీరియస్‌గా మారాయి” అంటూ సటైర్లు వేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.  పూనమ్ ట్వీట్ చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. పూనమ్ కౌర్‌ ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు. ఆమె పెట్టిన ట్వీట్ కు పూర్తి వ్యతిరేకంగా మరో ట్వీట్ వేశారు. ఆమెను సిస్టర్ అని పిలుస్తూ.. “లేదు సిస్, నిజానికి రాజకీయం సినిమాగా,  సినిమా రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను” అని అంటూ రాసుకొచ్చారు.  










ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ అభిమానులు


అటు పూనమ్ కౌర్, ఆర్జీవీ ట్వీట్స్ మీద పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మేధావుల మాట్లాడుతున్నారు చూడండి అంటూ పంచులు వేస్తున్నారు.  


Read Also: ఆక్వా మెరైన్ పార్క్ వద్దే వద్దు - కోర్టుకెక్కిన సినీ తారలు, ప్ర‌భుత్వానికి నోటీసులు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial