మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. జూన్ 14తో వీరిద్దరూ పెళ్లి చేసుకొని పదేళ్లు పూర్తి కావొస్తుంది. వారి పెళ్లి యానీవర్సరీను సెలబ్రేట్ చేసుకోవడానికి కాస్త ముందుగానే ట్రిప్ కి వెళ్లింది ఈ జంట. ప్రస్తుతం ఇద్దరూ ఇటలీలో ఉన్నారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో చరణ్, ఉపాసన ఇద్దరూ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని కనిపించారు. చుట్టూ గ్రీనరీ, మధ్యలో చరణ్-ఉపాసన ఒకరినొకరు చూసుకుంటూ ఫొటోకి పోజిచ్చారు. దీనికి స్మైలీ ఎమోజీని జోడిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు రామ్ చరణ్. ఈ ఫొటో చూసిన మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
రామ్ చరణ్-ఉపాసనకు అడ్వాన్స్ గా మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంటకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటోంది ఈ జంట. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన #RC15 సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు శంకర్(Shankar) రూపొందిస్తోన్న ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ(Kiara Advani) కనిపించనుంది.
Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!
Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్