మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన పదేండ్ల వివాహ జీవితం అనంతరం, మెగా ఫ్యామిలీ నుంచి బ్రహ్మాండమైన వార్త బయటకు వచ్చింది. త్వరలో వీరిద్దరు పేరెంట్స్ కాబోతున్నట్లు. మెగా స్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈమెరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను నమ్మే హనుమాన్ ఆశీర్వాదంతో ఉపాసన, రాంచరణ్ తొలి బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు చెప్పారు.


సోషల్ మీడియాలో ట్రెండింగ్


ఆయన ఈ వార్త బయటకు చెప్పగానే సోషల్ మీడియాలో రాంచరణ్-ఉపాసన దంపతుల అంశమే హాట్ టాపిక్ అయ్యింది. ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  ‘కంగ్రాట్స్ అన్నా’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో #CongratulationsAnna ట్రెండింగ్ లో కొనసాగుతోంది. చాలా మంది నెటిజన్లు క్రియేటివ్ గా రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. రకరకాల సినిమాల్లోని వీడియోలను కట్ చేసి, సందర్భానికి సరిపోయేలా పోస్టు చేస్తున్నారు.