‘జాతి రత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి, చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా  ‘Miss శెట్టి  Mr. పొలిశెట్టి’. సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ సినిమాలో నవీన్ తో కలిసి నటిస్తోంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు మహేష్ కుమార్ పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు.  నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ అందరినీ నవ్వించింది. అనుష్క, నవీన్ మధ్య కామెడీ ఆకట్టుకుంది. నవీన్ పంచులకు ప్రేక్షకులు పడీపడీ నవ్వారు. ఈ టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.


చాలా ఫ్రెష్ గా ఉంది, ఆల్ ది బెస్ట్- రామ్ చరణ్


ఇప్పటికే  ‘Miss శెట్టి  Mr. పొలిశెట్టి’ టీజర్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరారు.  ఈ మూవీ టీజర్ నచ్చిందంటూ ట్వీట్ చేశారు. “‘Miss శెట్టి  Mr. పొలిశెట్టి’ టీజర్ చాలా నచ్చింది. రిఫ్రెష్‌గా ఉంది. సినిమా యూనట్ కు గుడ్ లక్”అని ట్వీట్ చేశారు. రాంచరణ్‌ ట్వీట్‌తో సినిమాపై బజ్‌ మరింత పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నోనోనో  లిరికల్ వీడియో సాంగ్‌ బాగా వైరల్ అవుతోంది. సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ సైతం ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రం యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితం అవుతోంది.  సినీయర్ నటి జయసుధ ఈ చిత్రంలో అనుష్క తల్లిగా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది.  






చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించబోతున్న అనుష్క, నవీన్


ఇక అనుష్క చివరి సారిగా ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. అప్పటి నుంచి అనుష్క సినిమాలు చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాతో వెండితెరపై కనిపించబోతోంది. ఆమె అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు.  అటు నవీన్ పొలిశెట్టి కూడా చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఇంత కాలం తర్వాత స్వీటీతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు.   






Read Aslo: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది, నేరుగా థియేటర్లలోనే విడుదల - తెలుగు రాష్ట్రాల్లో నయా రికార్డ్!