రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా, సీత దేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది.  జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మేకర్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్ కార్యక్రమాలకు ఫ్లాన్ చేస్తున్నారు.


నేరుగా థియేటర్లలోనే ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదల


ఇక ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ ను  గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నారు. కనీ వినీ ఎరుగ స్థాయిలో ట్రైలర్ స్ర్కీనింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 105 థియేటర్లలో 3D వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ‘ఆదిపురుష్’ ట్రైలర్ మే 9న సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల కానుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకట్టుకునే ట్రైలర్ తో సినిమాపై ఓ రేంజిలో ఎక్స్ పెక్టేషన్స్ పెంచడంతో పాటు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. 3 నిమిషాలకు పైగా ఉన్న టీజర్ అదిరిపోయే  విజువల్స్, యాక్షన్స్, సెంటిమెంట్ కలబోతగా రూపొందించారట. ‘ఆదిపురుష్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని  పట్ల యూనిట్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హీరో  ప్రభాస్ సైతం అద్భుతం అన్నారట.   


నెగెటివ్ ప్రచారంతో సినిమా విడుదల వాయిదా


వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. అయితే, టీజర్ విడుదల తర్వాత తీవ్ర స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి పేలవమైన VFX అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఆదిపురుష్’ యూనిట్ చాలా విమర్శలను ఎదుర్కొంది. సినిమాపై ఉన్న హైప్ దెబ్బతినడంతో విడుదలను కొంత కాలం వాయిదా వేశారు. రీసెంట్ మళ్లీ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేలా చేశారు. ఇటీవల విడుదలైన కొత్త పోస్టర్, జై శ్రీరామ్ పాట సినిమాకు మొదట్లో వచ్చిన కొన్ని ఎదురుదెబ్బలను తిప్పికొట్టడంలో ఉపయోగపడ్డాయి.


Read Also: ఆస్కార్‌తో పాటు 8 అంతర్జాతీయ అవార్డులపై గురి, 'తంగళన్' టీమ్ టార్గెట్ మామూలుగా లేదుగా!


జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల


ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' దేశంలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రాల్లో ఒకటిగా నిలువబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో ప్రభాస్‌తో పాటు, జానకిగా కృతి సనన్, లంకేయుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. సినిమా కంటెంట్, అద్భుతమైన VFX కలిసి సినిమాను ఓ రేంజిలో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పైనే ఉంది. దానిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే సినిమా భవిష్యత్ ఆధారపడి ఉండబోతోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.






Read Aslo: షారుఖ్ మేనేజర్ సంపాదన ఎంతో తెలుసా? ఆమె ముందు బడా కంపెనీల సీఈవోలు కూడా దిగదుడుపే!