ప్రపంచంలో అత్యంత ధనవంతులైన సినీ ప్రముఖులలో ఒకరు షారుఖ్ ఖాన్. సినిమాలు, ఎండార్స్ మెంట్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఆయన సతీమణి గౌరీ ఖాన్ సైతం ముంబైలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా గుర్తింపు పొందిన ఆమె, ఎన్నో ఇళ్లను తన ఐడియాస్ తో అద్భుతంగా తీర్చిదిద్దింది. రీసెంట్ గా తన భర్త షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ డ్రీమ్ హౌస్ కు కూడా తనే ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది. ఈ ఫోటోలను పూజా తన ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది. అప్పటి నుంచి పూజా దద్లానీ ఎవరు? ఆమె సంపాదన ఏంటి? అనే విషయాలను నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ పూజా ఎవరు? 


ఎవరీ పూజా దద్లానీ?


పూజా దద్లానీ ముంబైలోనే పుట్టి పెరిగింది. దశాబ్ద కాలంగా షారుఖ్ మేనేజర్ గా పని చేస్తుంది. చాలా కాలం నుంచి షారుఖ్ సన్నిహితురాలు. షారుఖ్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. 2012 నుంచి షారుఖ్ ఖాన్ తో పాటు అతడి నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కు మేనేజర్ గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ టీమ్ KKRను కూడా తనే మేనేజ్ చేస్తుంది.


పూజా సంపాదన, నికర ఆస్తుల విలువ ఎంతంటే?


పలు నివేదికల ప్రకారం షారుఖ్ మేనేజర్ గా పూజా ఏడాదికి రూ.7 నుంచి రూ. 9 కోట్ల వరకు తీసుకుంటుంది. వివిధ నివేదికల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 45 నుంచి రూ. 50 కోట్లు ఉంటుంది.


పూజా డ్రీమ్ హౌస్   


రీసెంట్ గా ముంబై బాంద్రాలో పూజా తన కలల సౌధాన్ని నిర్మించుకుంది. ఈ ఇంటి ఇంటీరియర్ ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. ఆమె గ్యారేజీలో లగ్జరీ నీలిరంగు మెర్సిడెస్ కారు కొలువుదీరింది.   






షారుఖ్ ఖాన్ కు అండగా పూజా  


పూజా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది. 2021లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సందర్భంలో ఆ కుటుంబానికి బాసటగా నిలిచింది. దగ్గరుండి పోలీసు కేసు వ్యవహారాలను చూసుకుంది.  






పూజా దద్లానీ ఫ్యామిలీ


2008లో పూజా వ్యాపారవేత్త అయిన హితేష్ గుర్నానీని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు రేన. పూజా తరచుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది. పూజా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినీ ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు, మీటింగ్స్,  ప్రమోషన్స్ లో కనిపిస్తుంటుంది.






Read Also: ఆస్కార్‌తో పాటు 8 అంతర్జాతీయ అవార్డులపై గురి, 'తంగళన్' టీమ్ టార్గెట్ మామూలుగా లేదుగా!