సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడిప్పుడే అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇటు సౌత్ లో అటు నార్త్ లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవనే చెప్పుకోవచ్చు. దీంతో బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. బహిరంగంగానే బాయ్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తోంది. తనతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.


వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కే అవకాశం!


మూడు పదుల వయుసు దాటిన ఈ హాట్ బ్యూటీ, కొంత కాలంగా జాకీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ గురించి బయటకు చెప్పింది. ఇంతకాలం సీక్రెట్ గా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించినా, ఇప్పుడు ఓపెన్ గానే కలిసి తిరుగుతున్నారు.  తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా జాకీతో కలిసి వేడుకలు జరుపుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక క్రిస్మస్ సందర్భంగా జాకీతో బాగానే ఎంజాయ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ పెట్టింది. ‘తనకు శాంటా ఇచ్చిన గిఫ్ట్ జాకీ’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అటు వచ్చే ఏడాది వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా మాత్రం వీరిద్దరు ఎలాంటి ప్రకటన చేయలేదు. రకుల్ కు కూడా పెద్దగా సినిమా అవకాశాలు రావడం కాబట్టి, ఇక పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడపడమే బెస్ట్ అంటున్నారు నెటిజన్లు.






కన్నడ మూవీతో పరిచయం, సౌత్ టాప్ హీరోయిన్ చలామణి


నార్త్ ఇండియన్ బ్యూటీ అయినా, కన్నడ సినిమాతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అక్కడి నుంచి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ‘కెరటం’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.’తడయార తాక్క’ మూవీతో తమిళం ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తొలుత పెద్దగా సక్సెస్ లు రాకపోయినా, ఆ తర్వాత వరుస విజయాలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం హిందీతో పాటు సౌత్ సినిమాలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.  ప్రస్తుతం రకుల్ తమిళంలో ఓ సినిమా చేస్తోంది. శివకార్తికేయన్ తో కలిసి ‘అయలాన్‌’ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అటు లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి ‘ఇండియన్ 2’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.    






Read Also: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే - అధికారులే అలా చేయమన్నారు - పోస్టుమార్టం ఉద్యోగి సంచలన ఆరోపణలు