Rajinikanth Discharge: ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీన తలైవర్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ప్రధాన రక్త నాళం బృహద్ధమనిలో సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ సమస్య కోసం ఆయన గుండెలో ఒక స్టంట్ వేశారు. అనంతరం ఆయన కండీషన్ స్టేబుల్ అయింది.


సినిమాల్లో బిజీగా తలైవర్
ప్రస్తుతం రజనీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'జై భీమ్' డైరెక్టర్ టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమా మొదటిది. అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ‘వేట్టయన్: ది హంటర్’ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది.


Also Readదళపతి విజయ్ లాస్ట్ సినిమాలో విలన్‌గా 'యానిమల్' స్టార్ బాబీ డియోల్ - హీరోయిన్లుగా వాళ్లిద్దరూ?


ఈ సినిమాలో రజనీకి జోడీగా మలయాళ భామ, సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


'వేట్టయన్' కాకుండా 'విక్రమ్', 'ఖైదీ', 'మాస్టర్', 'లియో' సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్. రజనీ కోలుకున్న తర్వాత మళ్లీ ‘కూలీ’ షూటింగ్ ప్రారంభిస్తారు. హీరో అవసరం లేని సన్నివేశాలను అప్పటి వరకూ షూట్ చేయడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?