యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu), దర్శకుడు హసిత్ గోలీ (Hasith Goli)లది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'రాజ రాజ చోర' సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకులను సైతం మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర శ్రీ విష్ణుకు మంచి వసూళ్లు తెచ్చిపెట్టింది. అటువంటి విజయం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా 'స్వాగ్' (Swag Movie). దీని ఓటీటీ పార్టనర్ ఏదో తెలుసా?


ప్రైమ్ వీడియో ఓటీటీకి శ్రీ విష్ణు 'స్వాగ్'
Amazon prime video acquires Sri Vishnu Swag movie digital streaming rights: 'స్వాగ్' సినిమా ఈ రోజు (అక్టోబర్ 4వ తేదీ) థియేటర్లలోకి వచ్చింది. హాల్లో సినిమా ప్రారంభం కావడానికి అంటే ముందు తమ ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో అని చిత్ర బృందం తెలియజేసింది.


థియేటర్లలో విడుదల అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేలా ఒప్పందాలు జరిగినట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కనుక బాగా ఆడితే కాస్త ఆలస్యంగా డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.


'రాజ రాజ చోర' విజయానికి తోడు శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు థియేటర్లలో మంచి విజయాలను నమోదు చేశాయి. 'సామజవరగమన' సినిమాకు ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పట్టారు. ఆ మూవీ వినోదంతో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత 'ఓం భీమ్ బుష్'లో కామెడీ పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన సరే మెజారిటీ జనాలు ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు శ్రీ విష్ణు. అందువల్ల 'స్వాగ్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నాగర్కర్ హీరోయిన్లుగా చేశారు. ఈ ముగ్గురూ డ్యూయల్ రోల్స్ చేయడం విశేషం


Also Read: 'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?



మొత్తం ఐదు పాత్రల్లో అదరగొట్టిన శ్రీ విష్ణు 
'స్వాగ్' సినిమాలో నాలుగు డిఫరెంట్ రోల్స్ చేశానని శ్రీ విష్ణుతో పాటు దర్శకుడు హసిత్ గోలీ, మిగతా చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తుంది. కానీ, థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. శ్రీ విష్ణు సినిమాలో ఐదు క్యారెక్టర్లు చేశారు. అందులో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక స్పెషల్ క్యారెక్టర్ నటుడిగా ఆయన స్థాయిని పెంచడంతో పాటు ప్రేక్షకులలో గౌరవం తెప్పించేలా ఉంది. ఈ సినిమాతో నటుడిగా శ్రీ విష్ణు కి పేరు వచ్చింది. కానీ, దర్శకుడుగా హసిత్ గోలికి పూర్తిస్థాయిలో విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఆమోదముద్ర రాలేదు. అందువల్ల, సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది.


Also Readజోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్ - Joaquin phoenix మూవీ ఎలా ఉందంటే?