‘బీస్ట్’ చిత్ర దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్ నటిస్తున్న 169వ చిత్రానికి టైటిల్ పెట్టేశారు. ఈ సందర్భంగా ‘జైలర్’ అనే టైటిల్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. రక్తపు మరకలు అంటిన కత్తితో ఉన్న ఈ పోస్టర్‌‌ను చూసి తలైవార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే, ‘బీస్ట్’ పరాజయం కూడా ఒకింత అభిమానులను కలవరపెడుతోంది. 
 
సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. రజనీకాంత్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించనున్నట్లు సమాచారం. ప్రియాంక అరుల్ మోహన్ మరో హీరోయిన్‌గా కనిపించునున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఇంకా కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌ కుమార్‌ కూడా నటిస్తున్నాడు. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న హీరో శివ కార్తికేయన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ రజినీ పాత్రలో కార్తికేయన్ కనిపించినున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, కేఎస్‌ రవికూమార్‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. 


Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?


Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?