‘ముని/కాంచన’ సిరీస్‌తో హర్రర్ సినిమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసిన నటుడు రాఘవ లారెన్స్. ఆయన నటిస్తున్న తాజా హర్రర్ సినిమా ‘చంద్రముఖి 2’. 2005లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి’కి ఈ సినిమా సీక్వెల్. మొదటి భాగంలో రజనీ హీరోగా నటించారు. రెండో భాగంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇఫ్పుడు ఫస్ట్ సింగిల్ ‘స్వాగతాంజలి’ ద్వారా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
‘లాస్య విలసిత... నవ నాట్య దేవత... నటనాంకిత... అభినయ వ్రత... చారు గీత చరిత...’ అంటూ సాగే ఈ పాట ట్యూన్ కూడా చాలా క్యాచీగా ఉంది. వినగానే నచ్చేట్లుగా ఉన్న ఈ పాటలో ఇన్‌స్టంట్ ఛార్ట్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి. కొత్త చంద్రముఖిగా కంగన సరిగ్గా సెట్ అయ్యారు. అక్కడక్కడ యోధుడి గెటప్‌లో రాఘవ లారెన్స్‌ను కూడా చూపించారు. ఈ పాటకు లిరిక్స్‌ను చైతన్య ప్రసాద్ అందించారు. శ్రీనిధి తిరుమల తన గొంతుతో పాటకు ప్రాణం పోశారు.
ఇటీవలే ‘చంద్రముఖి-2’ సినిమాకు సంబంధించి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ ను నిర్మాతలు విడుదల చేశారు. పట్టు చీరలో రాజ నర్తకిగా కంగన చాలా అందంగా ున్నారు. నడుముకు వడ్డాణం, మెడకు అద్దినట్లుగా హారం, నెత్తిన పాపిటబిళ్లతో తదేకంగా చూస్తున్న ఫోటో చూసే వారిని అలరిస్తోంది. ఇప్పటికే లారెన్స్ ఫస్ట్ లుక్ కు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ రాగా, ఇప్పుడు కంగనా ఫస్ట్ లుక్ కు అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ‘చంద్రముఖి 2’ విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. హాస్య నటుడు వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: 'తమ్ముడు' పక్కన పెట్టేసిన రీమేక్ తో 'అన్నయ్య' చేతికి!
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చంద్రముఖి
2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటన అప్పట్లో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపస్తూనే, మరోవైపు చంద్రముఖి అనే దెయ్యం పాత్రలో కూడా నటించి జ్యోతిక మెప్పించారు. చంద్రముఖిగా ఆమె నాట్యానికి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’ ఆధారంగా ‘చంద్రముఖి’ తెరకెక్కింది.
బోలెడన్ని రీమేక్స్ కూడా
అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ‘భూల్ భులయ్యా’గా ‘చంద్రముఖి’ తెరకెక్కింది. ఈ సినిమా కూడా అక్కడ బాగానే సూపర్ హిట్ అయింది. ఇటీవలే కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘భూల్ భులయ్యా 2’ పేరుతో దాని సీక్వెల్ తీశారు. పాండమిక్ తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాగా ఇది నిలిచింది. తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నాగవల్లి’ పేరుతో సీక్వెల్ తీసినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
Also Read: అర్థరాత్రి అప్డేట్ - ఇప్పుడిదే ఇండస్ట్రీలో నయా ట్రెండ్, ఎందుకలా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial