Radhika Sarathkumar Getting  A Phone Call From Mohanlal: జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తర్వాత పలువురు మహిళా నటులు తమకు గతంలో ఎదురైన  లైంగిక వేధింపుల గురించి వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ షాకింగ్ విషయాలు చెప్పారు. మహిళా నటుల క్యారవ్యాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేటు వీడియోలు తీసినట్లు చెప్పారు. తనకు ఎదురైన అలాంటి సంఘటన గురించి వివరించారు.ఈ విషయం తెలిసిన వెంటనే ‘అమ్మ‘ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ తనకు కాల్ చేసినట్లు రాధిక చెప్పారు.


“క్యారవ్యాన్ లో సీక్రెట్ కెమెరాల గురించి చెప్పగానే, మోహన్ లాల్ నాకు కాల్ చేశారు. తాను ఉన్న సెట్ లో అలాంటి ఘటన జరిగిందా? అని అడిగారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సెట్స్ లో కీలక నటీనటులు ఎవరు లేరని చెప్పాను. ఈ ఘటనకు సంధించిన పూర్తి వివరాలు అడిగారు. పలు విషయాలను తెలుసుకున్నారు. క్యారవ్యాన్ లో సీక్రెట్ కెమెరాల గురించి నాకు తెలియగానే వెంటనే గట్టిగా అరిచానని చెప్పాను. ఈ విషయాన్ని సదరు సినిమా నిర్మాణ సంస్థ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించారు. క్యారవ్యాన్ సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు మోహన్ లాల్ కు వివరించాను” అని రాధికా శరత్ కుమార్ వెల్లడించారు.   


క్యారవ్యాన్ క్కాలంటేనే భయంగా ఉంది- రాధికా శరత్ కుమార్


హేమ కమిటీ రిపోర్టు తర్వాత స్పందించిన రాధికా శరత్ కుమార్ మలయాళ ఇండస్ట్రీతో పాటు చాలా సినీ పరిశ్రమలలో లైంగిక వేధింపుల వ్యవహారం ఉందన్నారు. తనకు కూడా ఇలాంటి ఘటనకు బాధితురాలిని అయ్యానని చెప్పారు.  క్యారవ్యాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దుస్తులు మార్చుకునే వీడియోలు తీశారని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత క్యారవ్యాన్ ఎక్కాలంటేనే భయంగా ఉందని చెప్పుకొచ్చారు.


హేమ కమిటీ రిపోర్టుపై సీనియర్ నటులు నోరు విప్పాలి- రాధికా శరత్ కుమార్


హేమ కమిటీ రిపోర్టుపై సీనియర్ నటీనటులు మాట్లాడాలని రాధికా శరత్ కుమార్ కోరారు. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన రజనీకాంత్ హేమ కమిటీ రిపోర్టు గురించి తనకు తెలియదని చెప్పడం పట్ల ఆమె స్పందించారు. హేమ కమిటీ విషయంలో అగ్ర నటుడు సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు. రజనీకాంత్ కు నిజంగానే హేమ కమిటీ రిపోర్టు గురించి తెలిసి ఉండదని, లేదంటే తను మాట్లాడే వారని చెప్పారు. రజనీకాంత్ లాంటి నటులు మాట్లాడకపోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. అగ్ర నటులు మాట్లాడే మాటలు మహిళా నటులకు ధైర్యాన్ని ఇస్తాయన్నారు. మహిళల తరఫున తన భర్త శరత్ కుమార్ ను కూడా మాట్లాడాని కోరినట్లు చెప్పారు.


Read Also: క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి, ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించారు - నటి రాధిక సంచలన కామెంట్స్‌



Also Read: టాలీవుడ్‌లోనూ హేమ కమిటీలాంటిది ఏర్పాటు చేయండి- సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన సమంత