Discount Offer September 2024: టాటా మోటార్స్ అమ్మకాలు గత కొన్ని నెలల్లో కొద్దిగా తగ్గాయి. అమ్మకాలను పెంచుకోవడానికి టాటా తన వాహనాలపై వరుసగా మూడో నెలలో కూడా బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ తన ప్రీమియం కార్లపై కూడా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. టాటా సఫారీ, హారియర్, నెక్సాన్‌లపై రూ. లక్ష వరకు తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి.
టాటా సఫారీపై ఎంత తగ్గింది?
టాటా మూడు వరుసల ఎస్‌యూవీ సఫారీపై రూ. 50,000 నుంచి రూ. 1.4 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. 20 లక్షల ఎస్‌యూవీల విక్రయం తర్వాత టాటా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎంవై23 మోడల్‌పై అదనంగా రూ.25,000 తగ్గింపు కూడా అందిస్తారు. ఈ కారు మిడ్-స్పెక్ వేరియంట్లు అత్యధిక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. టాటా సఫారీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి మొదలై రూ. 27.34 లక్షల వరకు ఉంది.
టాటా హారియర్‌పై ఎంత తగ్గించారు?
టాటా హారియర్ అనేది ఒక 5 సీటర్ ఎస్‌యూవీ. ఈ కారుపై రూ.1.20 లక్షల తగ్గింపు ఇస్తోంది. అదే సమయంలో దాని ఎంవై23 మోడల్‌పై రూ. 25,000 అదనపు తగ్గింపు అందిస్తున్నారు. దాని మిడ్-స్పెక్ వేరియంట్‌పై అత్యధిక తగ్గింపు అందుబాటులో ఉంది. అదే సమయంలో లో స్పెక్ వేరియంట్‌లపై రూ. 70,000, టాప్ ఎండ్ వేరియంట్‌పై రూ. 50,000 ఆఫర్ కూడా ఉంది. టాటా హారియర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.99 లక్షల నుంచి మొదలై రూ. 26.44 లక్షల వరకు ఉంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
టాటా నెక్సాన్‌పై ఎంత తగ్గింది?
టాటా నెక్సాన్‌పై రూ.16,000 నుంచి రూ.లక్ష వరకు తగ్గింపును అందిస్తున్నారు. దాని ఎంవై23 మోడల్‌పై అదనపు నగదు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8 లక్షల నుంచి మొదలై రూ. 15.8 లక్షల వరకు ఉంటుంది.
టాటా టిగోర్‌పై తగ్గింపు ఆఫర్లు
టాటా టిగోర్ కొనుగోలుదారులు ఎంవై23 మోడల్‌పై రూ. 90,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కాగా దాని తాజా మోడల్‌పై రూ.60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. టాటా టిగోర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.65 లక్షల నుంచి మొదలై రూ. 8.90 లక్షల వరకు ఉంటుంది.
మరోవైపు టాటా పంచ్ మాత్రం అమ్మకాల్లో దూసుకుపోతుంది. మారుతి సుజుకి వాగన్ ఆర్‌కు వెనక్కి నెట్టి ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా టాటా పంచ్ నిలిచింది. ఇటీవలే లాంచ్ అయిన టాటా కర్వ్ బుకింగ్స్ కూడా మంచి జోరుగా సాగుతున్నాయి.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే