యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూడు నిమిషాల పైనే నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో కథను కొంచెం రివీల్ చేశారు.
ఈ ట్రైలర్‌లో ప్రపంచం మొత్తం కలవాలనుకునే హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌ను కృష్ణంరాజు పరిచయం చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ విక్రమాదిత్యను కలవడానికి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంతో పాటు ప్రభాస్, పూజా హెగ్దేల రొమాన్స్‌ను ఇందులో హైలెట్‌గా చూపించారు. వీరిద్దరూ ప్రేమించుకుంటే ప్రళయం వస్తుందని చూపించడం ద్వారా స్టోరీని కూడా రివీల్ చేశారు. షిప్ ఉన్న విజువల్స్ టైటానిక్‌ను తలపించాయి. అయితే మొత్తంగా చూస్తే విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు.
2022 జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్దే నటించిన ఈ సినిమాలో.. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, మేజర్ రవిచంద్రన్, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. రాధే శ్యామ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వెర్షన్లకు ‘డియర్ కామ్రేడ్’ ఫేం జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.