మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్ విలీనమైనట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. నిజానికి పీవీఆర్ సంస్థ సినీపోలీస్ తో విలీన చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఐనాక్స్ తో డీల్ పెట్టుకుంది పీవీఆర్. రెండు భారీ సంస్థలు విలీనమవుతుండడంతో భారత మల్టీప్లెక్స్‌ రంగంలో కేవలం రెండు కంపెనీలే రాజ్యమేలే పరిస్థితి వస్తుందని.. ఈ రంగంలో పలు మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


అయితే ఈ డీల్ ని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాల్సివుంది. అప్రూవల్ ఓకే అయితే.. పీవీఆర్ సంస్థ చైర్మన్ అజయ్ బిజ్లీ జాయింట్ వెంచర్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. సంజీవ్ కుమార్ ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ చైర్మన్ పవన్ కుమార్ జైన్ ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అపాయింట్ చేయనున్నారు.


 ఈ విలీనం తరువాత పీవీఆర్ ప్రమోటర్స్ 10.63 పర్సెంట్ స్టేక్ ను తీసుకోనున్నారు. ఐనాక్స్ ప్రమోటర్స్ కి 16.66 శాతం వాటా అందనుంది. ప్రస్తుతం పీవీఆర్ కి 73 సిటీల్లో 181 ఏరియాల్లో 871 స్క్రీన్లు ఉన్నాయి. ఐనాక్స్ కి 72 సిటీల్లో 160 ఏరియాల్లో 675 స్క్రీన్లు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 1546 స్క్రీన్లు. ప్రస్తుతం పీవీఆర్, ఐనాక్స్ పేర్లతో ఉన్న థియేటర్లు అవే పేర్లతో కంటిన్యూ అవుతాయి. కొత్తగా నిర్మించే థియేటర్లకు మాత్రం పీవీఆర్ ఐనాక్స్ అని పేరు పెట్టబోతున్నారు. 


Also Read: 'ది కశ్మీర్ ఫైల్స్' నా సినిమాను దెబ్బకొట్టింది - అక్షయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్